నయనతారను పక్కకు నెట్టిన త్రిష.. కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాకు అన్ని కోట్లా!

40 ఏళ్లు దాటిన తర్వాత కూడా క్రేజీ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటిదాకా నయనతార దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్ గా, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం నయనతారను పక్కకు నెట్టి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా త్రిష వచ్చి చేరింది.

దక్షిణాదిలో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
త్రిష కృష్ణన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న మణిరత్నం తదుపరి చిత్రమైన థగ్ లైఫ్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రిష కృష్ణన్ ఏకంగా 12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న దక్షిణాది హీరోయిన్లలో త్రిష టాప్ లో నిలిచారు.

Trisha stands on top in remuneration of south actresses instead of Nayanthara 12 crores for Thug Life

నయనతారను పక్కకు నెట్టిన త్రిష
ఇప్పటివరకు నయనతార మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కాగా, ఇప్పుడు త్రిష నయనతారను పక్కకు నెట్టారు. షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకోసం 11కోట్లు వసూలు చేసిన నయనతారను పక్కకి నెట్టి త్రిష థగ్ లైఫ్ సినిమాకు 12కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారు. అయితే త్రిష ఇంతగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి కారణం పొన్నియన్ సెల్వన్ నుంచి వరుసగా బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలు క్రియేట్ చేస్తున్న సెన్సేషన్.

పొన్నియన్ సెల్వన్ నుండి స్టార్ తిరిగిన త్రిష.. అన్నీ విజయాలే
2022లో, త్రిష మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 లో నటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఆపై దానికి సీక్వెల్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక 2023లో త్రిష దళపతి విజయ్ సరసన లియో సినిమాలో కథానాయకగా నటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. రీజన్ ఇదే
మొత్తంగా ఈ మూడు చిత్రాలు 1450 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో త్రిష ప్రస్తుతం తన రెమ్యునరేషన్ ను ఒక్కసారిగా పెంచేసింది. లియో విజయం తర్వాత దూకుడు మీద ఉన్న త్రిషకు వరుసగా ఆఫర్లు వస్తుంటే, దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణిగా భారీగానే వసూలు చేస్తున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+