విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. త్రిష షాకింగ్ పోస్ట్
హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష.

చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. భారీ జనసందోహం మధ్య విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చారు.
ఇటువంటి సమయంలోనే త్రిష చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మనుషులను దూరంగా పెడతాను. శునకాలను అమితంగా ప్రేమిస్తుంటాను. కానీ నా పెట్స్ మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయి. కాబట్టి మనమంతా కలిసి ప్రేమ సమాజాన్ని స్థాపిద్దామని రాసుకొచ్చింది. అయితే త్రిష ఈ పోస్ట్ విజయ్‌ను ఉద్దేశించే పెట్టారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్రిష అభిమానులు మాత్రం, ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి కాదని, ఆమె జంతు ప్రేమికురాలని, అందుకే ఈ పోస్ట్ పెట్టారని చెబుతున్నారు. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications