సినిమానే అనుకున్నాం..పాటలు కూడా ఇంత దారుణంగా ఉన్నాయ్ ఏంటీ బ్రో..!
తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి జరిగినంత చర్చ మరే సినిమాకు కూడా జరగలేదంటే అతిశేయోక్తి కాదేమో అనిపిస్తోంది. 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.కథ, కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.
సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపించాయి.ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చేలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు.

సినిమా కలెక్షన్లు ఫేక్ అని దిల్ రాజు సైతం తెలిపారు.ఇదిలా ఈ సినిమాపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాలోని వీడియో పాటలను ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే పాటలు కూడా అనుకున్నంత స్థాయిలో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. వినడానికి బాగున్న పాటలు, తెర మీద చూడటానికి మాత్రం బాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా వీడియో సాంగ్స్‌లో డ్యాన్స్ కన్నా, గ్రాఫిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రామ్ చరణ్ , కియారా అద్వానీల మధ్య డ్యాన్స్ స్టెప్పులు కూడా సరిగా కుదరలేదు. ముఖ్యంగా దూప్ సాంగ్ దారుణంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాతో పాటు, గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటలపై కూడా గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications