ఇంట్లో ఇల్లాలు..షూటింగ్‌లో ప్రియురాలు స్టార్ హీరో భాగోతం..!
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే ఓ హీరో ఇంట్లో భార్య ఉండగానే, మరో హీరోయిన్‌తో ఎఫైర్ కొనసాగించాడు.
అయితే ఈ విషయం భార్యకు తెలియడంతో ..ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్టార్ హీరోకు షాకిచ్చింది. ఇలా ఎఫైర్ పెట్టుకున్న హీరో మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..అక్షయ్ కుమార్ , హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో అప్పుడే ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రియాంక చోప్రాతో అక్షయ్ కుమార్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించాడు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

సరిగ్గా ఇదే సమయంలో బర్సాత్ అనే సినిమాలో వీరిద్దరు కలిసి నటించడానికి రెడీ అయ్యారు. ఇది అక్షయ్ కుమార్ వైవాహిక జీవితంపై ప్రభావం చూపించింది. సినిమా షూటింగ్ కొన్ని రోజులు జరిగిన తర్వాత, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా నుంచి తప్పుకుంటేనే కాపురానికి వస్తానని కండిషన్ పెట్టింది. దీంతో చేసేది లేక అక్షయ్ కుమార్ ఆ సినిమా నుంచి మధ్యలోనే వైదొలిగారు. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు సునీల్ బయటపెట్టారు.
దీని గురించి సునీల్ మాట్లాడుతూ..అక్షయ్ రూమర్స్ వస్తున్నప్పుడు జాగ్రత్త పడలేదు. అవి అబద్దం అని స్పష్టం చేయలేదు. అవి నిజమేనేమో అని భ్రమ కలిగించే లాగా కొన్ని తప్పులు చేశాడు. అతనికి, ప్రియాంక చోప్రాకి మధ్య ఉన్న సంబంధం గురించి వదంతులు మరింత వ్యాపించడంతో ట్వింకిల్ వాళ్ల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఒక నటుడుగా తన బాధ్యతలను అర్థం చేసుకోవాలి. తన భార్య కూడా ఒక నటి కాబట్టి, ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. అయినా ఇలా జరిగింది. అని చెప్పాడు.ఇక అక్షయ్ కుమార్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications