మళ్లీ మొదలు... భీకరంగా 'మెగా' వార్ Vs 'అల్లు' వార్

మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల నుంచి నడుస్తున్న ఈ యుద్ధం పిఠాపురం ఎన్నికల సమయంలో తారస్థాయికి చేరుకుంది. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా కుటుంబం మొత్తం అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహించింది. చివరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురంలోనే ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా స్టైల్ గా తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికి వచ్చాడు.

పైపై మెరుగులు అద్దుతున్న అల్లు అర్జున్
దీనిపై మెగా అభిమానులు భగ్గుమన్నారు. ఆ ఎన్నికల్లో శిల్పా ఓడిపోయాడు. పవన్ కల్యాణ్ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి బన్నీ సరిపెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా అల్లు అర్జున్ ఆర్మీకి, మెగా ఫ్యాన్స్ కు భీకర యుద్ధం జరుగుతుంటుంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవగా బెయిల్ పై బయటకు వచ్చారు. చిరంజీవి లాయర్ నిరంజన్ రెడ్డిని మాట్లాడి బెయిల్ వచ్చేలా చూశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవిని, నాగబాబును బన్నీ కలిశాడు. పవన్ కల్యాణ్ మాత్రం తనను కలిసే అవకాశం ఇవ్వలేదు. అయితే ఇదంతా పైపై మెరుగులు మాత్రమే అద్దుతున్నాడని అల్లు అర్జున్ తీరును బట్టి అర్థమవుతోంది.

Two incidents have reignited the war between the Mega family and Allu Arjun s family

అంతర్గత యుద్ధం నడుస్తోంది
కొద్దిరోజుల కిందట రామ్ చరణ్ జన్మదినం జరుపుకోగా అందరూ శుభాకాంక్షలు తెలియజేశారుకానీ బన్నీ చెప్పలేదు. అలాగే అల్లు అర్జున్ పుట్టినరోజు రాగా రామ్ చరణ్ తోపాటు మెగా హీరోలు, పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ మినహా ఇతర హీరోలెవరూ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేయలేదు. రామ్ చరణ్ కు విషెస్ చెప్పిన్ పవన్ కల్యాణ్ బన్నీకి ఎందుకు చెప్పలేదని అల్లు అర్జున్ ఆర్మీ ప్రశ్నిస్తోంది. అయితే అదే సమయానికి పవన్ చిన్న కొడుక్కి సింగపూర్ లో ప్రమాదం జరగడంతో హడావిడిగా అక్కడకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా అల్లు అర్జున్ ఆర్మీ పవన్ పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. పవన్ కల్యాణ్ చిన్న కొడుక్కి ప్రమాదం జరిగితే బన్నీ స్పందించలేదు. ఈ విషయంలో కనీస మర్యాద కూడా పాటించలేదు. ఈ సంఘటలన్నీ కలిపి మెగా కాంపౌండ్ కు, అల్లు కాంపౌండ్ కు కలవలేనంత దూరం పెంచడంతోపాటు ఇరువర్గాల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+