నా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుకుంటున్నాయి : రకుల్ ప్రీత్ సింగ్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికి అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా ఫలితం లేకుండా పోయింది. రకుల్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. ఇటీవల 'భారతీయుడు 2' తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది.

రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం విశేషం. అయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. జిమ్‌కు వెళ్తోన్న వీడియోలు, లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే రకుల్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
నాకు ప్రజెంట్ దక్కుతున్న ప్రేమకు.. అదృష్టం అనే పదం కరెక్టో కాదో నాకు తెలియదు. నేను సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిని కానప్పటికీ.. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు, ఆదరణకు ఎంతో రుణపడి ఉంటాను. అతి తక్కవ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు లభించింది. డిఫరెంట్ ఇండస్ట్రీలో పని చేస్తూ.. డిఫరెంట్ వ్యక్తుల నుంచి కొత్త విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తెలిసి జీవితంలో ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. వాటంతట అవి జరిగి.. జీవితంలో ఒక్కో మెట్టు ఎదగటానికి సహాయం చేస్తాయంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications