కష్టాల్లో రేణు దేశాయ్‌..అండగా నిలిచిన మెగా కోడలు

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు.

Upasana helped the NGO run by Renu Desai

ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు సైతం ఆమె సాయం చేస్తుంటారు. ఈ విషయంలో రేణు దేశాయ్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. నా సొంతంగా అంబులెన్స్, బ్యాంక్ అకౌంట్‌ను సంపాదించాను. నన్ను నమ్మి నా కొత్త జర్నీకి సపోర్ట్ చేయండి. 'శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్' అని ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశాను. పేజ్‌ను ఫాలో అవండి. అయితే అందరికీ నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. రూ. 500 అయినా సరే డొనేట్ చేయండి. నెలకు కనీసం రూ. 100 అయిన విరాళం ఇవ్వండి అది నాకు పెద్ద సహాయం. మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు.

Upasana helped the NGO run by Renu Desai

నేను నా సొంత డబ్బుతో హాస్పిటల్ కట్టిస్తాను. కానీ కొంత సమయం పడుతుందంటూ రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా ఈ వీడియోపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. రేణు దేశాయ్‌కి ఉపాసన తన వంతు సాయం చేశారు. చరణ్ పెంచుకున్న కుక్క రైమీ పేరుతో రేణు దేశాయ్ నడుపుతున్న ఎన్జీఓకి ఉపాసన విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. "అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు" అని రేణు దేశాయ్ అంబులెన్స్ ముందు దిగిన ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. అలాగే కొణిదెల ఉపాసనను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+