ఆమే నాకు స్ఫూర్తి అన్న మెగాకోడలు; ఉపాసనకు గుర్తింపు అందువల్లేనన్న రామ్ చరణ్!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండు విభిన్న సందర్భాలలో పాల్గొన్న ఉపాసన, ఒక ఆంగ్ల పత్రికకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన దంపతులు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నాలెడ్జ్ సిటీ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర చాలా కీలకమని రామ్ చరణ్ సతీమణి ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాలెడ్జ్ సిటీ లోని టీ హబ్ లో ట్రంప్ ఆఫ్ టాలెంట్ హౌస్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉపాసన పాల్గొన్నారు.

upasana praises her mother in law surekha and ram charan praises upasana

వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడకు ప్రధానంగా ధైర్యంగా, దృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అవార్డుల కార్యక్రమానికి వచ్చానని పేర్కొన్నారు. మా అత్తమ్మ ఎంతో ప్రేమ గల వ్యక్తి, ఆమె తనకు స్ఫూర్తి అంటూ ఉపాసన కొణిదెల రామ్ చరణ్ తల్లి, చిరంజీవి భార్య సురేఖను కొనియాడారు.

ఇక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి మహిళ విజయం వెనకాల ఒక పురుషుడు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు, తనది, రామ్ చరణ్ వాళ్ళది పూర్తిగా భిన్నమైన కుటుంబ నేపథ్యాలని, తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపించింది అన్నారు. ఇప్పుడు తనకు నీడలా ఉంటున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నారు.

upasana praises her mother in law surekha and ram charan praises upasana

తాము ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, బిడ్డని కనాలని నిర్ణయించుకున్న తర్వాతనే క్లీంకారకు జన్మనిచ్చామని అన్నారు. మహిళలు నా జీవితంలో కీలకపాత్ర పోషించారని, తను స్త్రీ ప్రపంచంగా భావించే వాతావరణంలో పుట్టి పెరిగానని ఉపాసన కొణిదల వ్యాఖ్యానించారు. ఇక ఉపాసన పై రామ్ చరణ్ వ్యాఖ్యలు చేస్తూ కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదన్నారు.

ఆమె చేసే ఎన్నో మంచి పనుల వల్లే ఆమెకు గుర్తింపు వచ్చిందన్నారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న, కుటుంబ విలువలను గౌరవిస్తున్న ఉపాసన వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకు వెళుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తను తనకు భార్య కావటం అదృష్టం అన్నారు రాం చరణ్ .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+