Ustaad Bhagat Singh: ఆన్‌లైన్‌లో సాంగ్ లీక్ - ఉస్తాద్‌కు కొత్త తలనొప్పి..!!
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా బాక్సాఫీస్ వద్ద మొదలవ్వడానికి సమయం దగ్గరపడింది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తన ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి 'ఉస్తాద్ భగత్ సింగ్'గా ముస్తాబవుతున్నారు పవన్. అయితే, ఈ సినిమా విడుదలపై వస్తున్న అప్‌డేట్స్‌తో పాటు ఒక చిన్న 'లీక్' వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ మళ్ళీ 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ చేయడానికి మార్చి 26, 2026న సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ మరో చిత్రం 'హరి హర వీరమల్లు' కంటే ముందే 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలోకి రావడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేద్దామనుకుంటున్న తరుణంలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది.

మహాశివరాత్రి కంటే ముందే 'లీక్' షాక్!
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "దేఖ్ లేంగే సాలా" సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఊపేసింది. ఇప్పుడు రెండో సాంగ్‌ను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అధికారికంగా విడుదల కాకముందే ఈ పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి. లీక్ వల్ల షాక్ అయిన మేకర్స్, ఇప్పుడు ఈ పాటను షెడ్యూల్ కంటే ముందే విడుదల చేస్తారా? లేదా అదే తేదీకి స్టిక్ అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
భారీ స్టార్ కాస్టింగ్.. అదిరిపోయే హైప్
ఈ చిత్రంలో పవన్ సరసన టాలెంటెడ్ బ్యూటీస్ శ్రీలీల మరియు రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ మాస్ బీట్స్‌తో మ్యూజిక్ అందిస్తున్నారు. ఆశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నప్పటికీ, పాట లీక్ అవ్వడం కాస్త అసహనానికి గురిచేస్తోంది. పవర్ స్టార్ గర్జన థియేటర్లలో ఎలా ఉండబోతుందో చూడాలంటే మార్చి 26 వరకు ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇందులో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications