రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !!

మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్, పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. కేవలం కంటెంట్ బలం మీదే ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. భారీ వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఐటమ్ సాంగ్స్ లేకుండానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మల్లు ఇండస్ట్రీ ప్రత్యేకతగా మారింది. ముఖ్యంగా రియలిస్టిక్ స్టోరీలు, సహజ నటన, బలమైన స్క్రీన్‌ప్లే ఇవే ఈ సినిమాల విజయానికి కారణంగా నిలుస్తున్నాయి.

ఈ కోవ లోనే రెండు సంవత్సరాల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో Vaazha ఒకటి. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా Vaazha 2 విడుదలై మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది.

vaazha-2-malayalam-movie-budget-on-10-crores-but-create-records-by-collecting-160-crores-with-in-10

ఈసారి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ అయి కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.163.50 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్లతో The Goat Life (రూ.158.50 కోట్లు) రికార్డును సైతం అధిగమించింది.

దర్శకుడు Savin తెరకెక్కించిన ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, Biju Kuttan, Alphonse Puthren, Vijay Babu, Aju Varghese వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. స్కూల్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, యువతలో ఉండే లక్ష్యహీనత, ఆత్మవిశ్వాసం వంటి అంశాలను హాస్యంతో మేళవిస్తూ తెరకెక్కించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ సీక్వెల్‌లో యువత జీవితాల్లో వచ్చే మార్పులు, బాధ్యతల వైపు మలుపు తిరిగే దశను కూడా హైలైట్ చేశారు. అందుకే ఇది కేవలం కామెడీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ఒక మెసేజ్ ఇచ్చే చిత్రంగా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తుండటం మరో విశేషం.

ఇక ఈ సినిమాకు నిర్మాతల్లో టాలీవుడ్‌కు చెందిన Sahu Garapati కూడా భాగస్వామి కావడం ఆసక్తికరం. ఆయన నిర్మించిన Mana Sankara Varaprasad Garu ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు 'వాజా 2' హిట్ కొట్టడంతో డబుల్ సక్సెస్‌ను అందించింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+