బిడ్డ కోసం ఆ పనికైనా సిద్ధమే.. వడాపావ్ గర్ల్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్!

సోషల్ మీడియాలో 'వడాపావ్ గర్ల్'గా పేరుపొందిన చంద్రికా దీక్షిత్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం అల్లుకుంది. ఓ తల్లిగా తన బిడ్డ పట్ల చంద్రిక చూపిన బాధ్యతను నెటిజన్లు వివాదాస్పద కోణంలో చూడటంతో నెట్టింట పెద్దఎత్తున రచ్చ జరుగుతోంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చంద్రికా దీక్షిత్.. తన జీవితంలోని కష్టాల గురించి.. తన బిడ్డను పెంచడం పట్ల తనకున్న అంకితభావం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో చంద్రికా దీక్షిత్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు నెటిజన్లను నివ్వెరపరిచింది. "ఓ తల్లిగా చెబుతున్నాను.. నా బిడ్డను పెంచడం కోసం.. మంచి భవిష్యత్తును అందించడం కోసం అవసరమైతే ఎవరితోనైనా పడుకోవాల్సి వచ్చిన నేను వెనకాడను" అని చంద్రిక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బిడ్డ పట్ల తల్లికున్న అంకితభావాన్ని ఆమె తనదైన శైలిలో వ్యక్తం చేసినప్పటికీ.. ఈ మాటలు నెటిజన్లుకు తప్పుగా అర్థమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్, విమర్శల వర్షం కురిసింది.

మిస్టరీ మ్యాన్ ఎంట్రీతో కొత్త డ్రామా
విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో చంద్రికా దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియోను పోస్ట్ చేసి నెటిజన్లను మరింత ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఓ సినిమా తరహా డ్రామాతో మొదలైంది. వీడియోలో ఓ ముఖం కనిపించని 'మిస్టరీ మ్యాన్' అకస్మాత్తుగా వచ్చి చంద్రిక నోరు గట్టిగా నొక్కి పట్టి, "బిడ్డను పెంచడం కోసం ఎవరితోనైనా పడుకుంటావా? నీ ఆలోచనలు ఇంత ఘోరంగా ఉన్నాయేంటి?" అని కోపంగా ప్రశ్నించడం అందులో కనిపిస్తుంది. ఇది ఆమెపై వస్తున్న విమర్శలను ప్రతిబింబించేలా ఉన్నప్పటికీ.. ఆమె ఈ వివాదాన్ని మళ్ళీ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆమె అతడిని నెట్టేసి, విమర్శకులకు తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు.

Vada Pav Girl Chandrika Dixit Controversy Bold Comment Sparks Massive Social Media Debate

ట్రోలర్లపై విరుచుకుపడిన చంద్రికా దీక్షిత్
బిడ్డ పెంపకం తల్లి అంకితభావం గురించి మాట్లాడిన తన మాటలను వక్రీకరిస్తున్నారని చంద్రికా దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రికా మాట్లాడుతూ.. "నేను మూడున్నర గంటల పాటు మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో నా బాధను, నా పోరాటాన్ని వివరించాను. నా బండిని, షాపును లాగేసుకున్నా సరే నేను కుంగిపోకుండా, ఇటుకలు మోసైనా, రొట్టెలు చేశైనా నా బిడ్డను పెంచుకుంటానని, చావడానికి సిద్ధపడనని చెప్పాను. కానీ మీరు మాత్రం కేవలం వ్యూస్ కోసం నేను అన్న ఒకే ఒక్క వాక్యాన్ని పట్టుకుని నా క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారు" అని చంద్రికా మండిపడ్డారు. సందర్భాన్ని విస్మరించి.. తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ట్రోలర్లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

మానసిక వేధింపులపై ఆవేదన
ఇక చివరిగా మనుషులపై సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్, మానసిక వేధింపులు ఎంతటి ప్రమాదకరమో ఆమె గుర్తు చేశారు. "మీరు చేసే ఇలాంటి పనుల వల్ల ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుంది. నేను స్ట్రాంగ్ కాబట్టి తట్టుకోగలుగుతున్నాను, కానీ నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఏమయ్యేది?" అని ఆమె ప్రశ్నించారు. ఏది ఏమైనా, 'వడాపావ్ గర్ల్' చేసే ప్రతీ కామెంట్, పోస్ట్ చేసే ప్రతీ వీడియో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+