ఏ ముస్లిం వ్యక్తితో వీడియోలు చేయను: మరో వివాదంలో 'వడా పావ్ గర్ల్'! (వీడియో)

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, 'వడా పావ్ గర్ల్'గా పేరుగాంచిన చంద్రికా దీక్షిత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. చంద్రికా దీక్షిత్ తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. గతంలో తాను ఓ ముస్లిం యువకుడితో(సైఫీ) కలిసి చేసిన వీడియోలు తన హిందూ సంస్కృతిని, తన మతస్థుల మనోభావాలను దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు. ఇకపై తన వీడియోలలో ఏ ముస్లిం యువకుడు కనిపించడని.. తాను కూడా ఏ ముస్లిం వ్యక్తితో కలిసి వీడియోలు చేయనని ఆమె స్పష్టం చేశారు. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉన్నప్పటికీ.. తన మతమే తనకు అత్యున్నతమని ఆమె ఆ వీడియోలో వెల్లడించారు.

మిస్టరీ మ్యాన్.. పబ్లిసిటీ స్టంట్స్
కొన్ని నెలల క్రితం చంద్రికా దీక్షిత్ తన భర్త యుగమ్ తనను మోసం చేస్తున్నాడని.. అతనికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అదే సమయంలో 'మిస్టరీ మ్యాన్' సైఫీతో కలిసి సన్నిహితంగా ఉన్న వీడియోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఓ వీడియో వైరల్ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అది కేవలం ఒక 'యాడ్ షూట్' అని.. పబ్లిసిటీ కోసమే అలా చేశామని ఆమె తర్వాత వెల్లడించారు. ఇప్పుడు భర్తతో మళ్లీ కలిసిపోయిన తర్వాత, ఆమె ఈ మతపరమైన ప్రకటన చేయడం గమనార్హం.

Vada Pav Girl Controversy Chandrika Dixit Vows Not to Film with Muslims Sparking Netizen Rage

హిందూ సంస్కృతిపై కామెంట్స్
తన వీడియోలో చంద్రికా దీక్షిత్ మాట్లాడుతూ.. "నేను చేసిన వీడియోలు నా హిందూ సంస్కృతికి విరుద్ధంగా ఉంటాయని నేను ఏమాత్రం ఊహించలేదు. తెలిసి తెలియక చేసిన ఈ తప్పుకు నన్ను క్షమించండి. నా మతాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేసి చూడను. ఇకపై ఏ ముస్లిం అబ్బాయి నా వీడియోల్లో ఉండడు" అని పేర్కొంటూ 'హర హర మహాదేవ్' అంటూ ముగించారు. భర్తతో విడిపోయినట్లు నాటకమాడి, సైఫీతో కలిసి రోడ్డుపై రీల్స్ చేస్తూ ప్రజలను మోసం చేశారని నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది.

'మరో కొత్త డ్రామా' అంటూ నెటిజన్ల ట్రోల్స్
చంద్రికా దీక్షిత్ చేసిన ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను 'హిందూ సింహం'అని కొనియాడుతుంటే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇదంతా ఓ పెద్ద డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. "నీ ఆరోగ్యం కంటే నీ నాటకాలే ఎక్కువగా ఉన్నాయి", "వ్యూస్ కోసం మతాన్ని అడ్డుపెట్టుకోవడం ఆపండి", "నిజంగా మతంపై అంత గౌరవం ఉంటే ఆ పాత వీడియోలన్నీ డిలీట్ చేయ్" అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఆమె ఆడుతున్న కొత్త నాటకం ఇదని పలువురు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+