లావణ్య కంటే ముందే ఆ హీరోయిన్‌తో లవ్‌లో వరుణ్ తేజ్..? వాస్తవాలు వెలుగులోకి

మెగా హీరో వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా అయింది. త్వరలోనే లావణ్య త్రిపాఠి -వరుణ్ తేజ్‌ల పెళ్లి చేయడానికి మెగా కుటుంబం రెడీ అవుతుంది. ఈ సమయంలోనే వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.

లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని ఈ వార్త సారాంశం. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు 'ముకుంద' సినిమాలో నటించిన పూజ హెగ్దె. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా 'ముకుంద'. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఫర్యాలేదనిపించినప్పటికి .. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

varun tej loves a heroine before lavanya tripathi..?

అయితే ఈ సినిమా సమయంలో హీరోయిన్ పూజ హెగ్దె‌తో ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ఒకనొక సందర్భంలో పూజ హెగ్దె‌ను పెళ్లి కూడా చేసుకుందామని వరుణ్ తేజ్ అనుకున్నాడట. కాని కారణాలు తెలియవు కాని.. వరుణ్ ప్రేమ ఆదిలోనే ఆగిపోయింది. పూజ హెగ్దెతో ఎఫైర్ గురించి తరువాత వరుణ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. పూజ హెగ్దె తనకు కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమే అని.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

varun tej loves a heroine before lavanya tripathi..?

లావణ్య త్రిపాఠి -వరుణ్ తేజ్‌ల పెళ్లి ఫిక్స్ అయిన తరుణంలో .. ఇప్పుడు వరుణ్ తేజ్- పూజ హెగ్దెల సంబంధించిన వార్త వైరల్ కావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్‌ల పెళ్లి డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+