తెలుగులో కొత్త మల్టీస్టారర్... ఎవరెవరంటే

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఎక్కువ మల్టీ స్టార్ సినిమాలు చేసిన ఘనత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కే దక్కుతుంది. ఈ తరం స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టార‌ర్‌ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘనత కచ్చితంగా వెంకటేష్‌దే. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, మహేష్ బాబు తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తేజ్ తో ఎఫ్2, ఎఫ్ 3, రామ్‌తో మసాలా.. చింతకాయల రవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక పాటలో స్టెప్పులు వేశాడు వెంకీ.

నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా చేశాడు. ప్రేమమ్ సినిమాలోనూ నటించారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు వెంకటేష్ ముందుంటాడు. తాజాగా వెంకీ అదిరిపోయే మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ-వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.

venkatesh and raviteja multi starrer

రవితేజ - చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయింది. మైత్రీ మూవీ బ్యానర్ లో రవితేజ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు రవితేజ బిజీగా ఉండడంతో ఆ సినిమాను కొంతకాలంగా హోల్డ్ లో పెట్టారు. ఆ సినిమాకు బదులుగా రవితేజతో మైత్రి వాళ్ళు చేయాల్సిన సినిమాను వెంకటేష్ - రవితేజ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అన్నది ? ఇంకా బయటకు రాలేదు. టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర క్రేజీ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. వెంకటేష్ - రవితేజ కాంబినేషన్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కచ్చితంగా సంచలన ప్రాజెక్ట్ అవుతుంది అనటంలో సందేహం లేదు. రవితేజతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమానే మల్టీస్టారర్ గా తీయబోతున్నారా అనే విషయంలో స్పష్టత వస్తేగానీ మిగతా విషయాలపై క్లారిటీ రాదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+