అల్లు అర్జున్ జాతకం చెప్పిన వేణుస్వామి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. మూడు రోజుల్లో రూ.600 కోట్లు వచ్చినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. అల్లు అర్జున్ నటనకు, దర్శకుడు సుకుమార్ ప్రతిభకు, నిర్మాతల నిర్మాణ విలువలకు అందరూ ముగ్ధులయ్యారు. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని, బాహుబలి2 రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. రికార్డుల వేటను మాత్రం పుష్ప2 కొనసాగిస్తూనే ఉన్నాడు.

రాజమాతంగి గెటప్ లో బన్నీ బాగా చేశాడు
సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. పుష్ప2లో అల్లు అర్జున్ నీలం రంగు చీర కట్టుకొని రాజమాతంగి గెటప్ లో వచ్చిన జాతర సన్నివేశంలో బన్నీ అద్భుతంగా నటించారంటూ కొనియాడారు. సినిమా నిర్మాణ విలువలు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో 2016 నుంచి ఉన్న ఏ వీడియో చూసినా తాను అల్లు అర్జున్ గురించి చెప్పిన విషయాలన్నీ ఉంటాయన్నారు. మరో 10 సంవత్సరాలు అల్లు అర్జున్ కు తిరుగులేదని చెప్పారు.

venu swamy predicted allu arjun horoscope

15 సంవత్సరాలు అల్లు అర్జున్ కు తిరుగులేదు
అల్లు అర్జున్ జాతకాన్ని తాను పూర్తిగా విశ్లేషించే ఆ వీడియోల్లో చెప్పానన్నారు. ఆయనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోయే అవకాశం లేదని, మరో 15 సంవత్సరాల వరకు కూడా ఆయనకు తిరుగుండదన్నారు. ఏ సినిమా చేసినా కచ్చితంగా హిట్ అవుతుందన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏకైక పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మాత్రమేనని వేణుస్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోపై ఇతర హీరోల అభిమానులు మండిపడుతున్నారు. రోజుకోరకంగా జాతకం చెప్పే నువ్వు నాగచైతన్య-శోభిత పెళ్లిచేసుకోకముందే విడిపోతారని చెప్పావని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని, జగన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ చెప్పావని అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. జాతకాలు చెప్పడం మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితవు పలుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+