2024లో విడాకులు తీసుకునే జంటలు వీళ్లే.. వేణు స్వామి జోస్యం
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీంతో ఆయన క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. ఇక ప్రభాస్ జాతకం గురించి చెప్పి వేణు స్వామి మాటలు పెను సంచలనమే సృష్టించాయి. ప్రభాస్ జాతకం బాలేదని... ఆయనకు హిట్లు వచ్చే అవకాశం లేదని.. ప్రభాస్ ఆరోగ్యం కూడా సరిగా లేదని అతి త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఆయన 2024లో విడిపోయే సెలబ్రిటీల లిస్ట్ గురించి చెప్పుకొచ్చారు. 2024లో ఇద్దరు టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఖాయమని వేణు స్వామి తెలిపారు. గతేడాది పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిలు ఓ మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారని సంచలన కామెంట్స్ చేశారు. వీరితో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకుంటారని ఆయన తెలిపారు.

మూడో భార్య అన్న లెజ్నోవాకు విడాకులిస్తారని, తరువాత పవన్ నాలుగో పెళ్లి కూడా పెళ్లి కూడా చేసుకుంటారని కుండ బద్దలు కొట్టేశారు. రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటారని..ఇదే విషయాన్ని వారికి తెలియజేశానని వేణు స్వామి తెలిపారు.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఈ ఏడాదే అని.. లేకపోతే ఆయనకు పెళ్లి కావడం కష్టమని చెప్పుకొచ్చారు. ఆయనకు అనారోగ్య కారణంగా పెళ్లి జరగపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
-
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications