విడాకుల బాటలో మరో స్టార్ హీరోయిన్..వేణు స్వామి జాతకమే నిజం అవుతుందా..?

ఓ స్టార్ హీరోయిన్ విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిందే నిజం అవుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో ఓ స్టార్ హీరోయిన్ గురించి జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నట్టే కనిపిస్తోంది.దీంతో జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆయన చెప్పిన హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.

Venu Swamy Predictions come true from star heroine Divorce

అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్‌ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. నయనతారకు పెళ్లి తరువాత కష్టాలు మొదలవుతాయని .. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలోనే వేణు స్వామి చెప్పడం జరిగింది.

Venu Swamy Predictions come true from star heroine Divorce

ఈ సమయంలో వేణు స్వామిపై నెటిజన్లు ఘాటుగానే విమర్శలు చేశారు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడాకులు గురించి మాట్లాడటం ఏంటని కొందరు ఆయనపై మండిపడ్డారు. అయితే వేణు స్వామి చెప్పినట్టుగానే వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది.

సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. ఇక నయనతార భర్త దర్శకత్వం వహిస్తున్న ఎల్. ఐ. సీ అనే సినిమా విషయంలో విఘ్నేష్ శివన్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.

Venu Swamy Predictions come true from star heroine Divorce

ఈ సంఘటనలు అన్నీ చూసిన తరువాత వేణు స్వామి చెప్పినట్టుగానే నయనతారకు పెళ్లి తరవాత కలిసి రాదనే అనిపిస్తోంది. ఇప్పటి వరకూ వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరిగింది. చివరికి ఆయన చెప్పిన విధంగానే విడాకులు తీసుకుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నయనతార విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజం అవుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+