వేణు స్వామి భార్య కూడా ప్రభాస్‌ను వదలడం లేదుగా..!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో వేణు స్వామి చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుబ్ బై చెబుతారని..మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం వేణు స్వామి సృష్టించారు. ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి.
ఇక ప్రభాస్ విషయంలో వేణు స్వామి మొదటి నుంచి కూడా నెగిటివ్‌గానే చెబుతూ వస్తున్నారు.బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయిన ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని.. ప్రభాస్ జాతకంలో హిట్ ఇప్పట్లో లేదని వేణు స్వామి కుండబద్ధలు కొట్టేశారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వేణు స్వామి భార్య కూడా బాగానే ఫేమస్ అయ్యారు. వేణు స్వామి పుణ్యమా అంటూ ఆయన సతీమణి వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. వేణు స్వామి భార్య వీణ వాయించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వీణ శ్రీవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో తాము పండించిన సీతాఫలాలు చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్‌కు పంపుతున్నట్లు చెప్పారు. 'ప్రభాస్ గారికి నేను పంపిన సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని కోరారు. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా..? అందుకే ఈ బాస్కెట్‌లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నా. ఈ ఫలాలతో పాటు నా గుర్తుగా ఆయన కోసం హ్యాండ్ మేడ్ బ్యాగ్‌ను కూడా పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సీజన్‌లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను.' అని తెలిపారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మొన్నటి వరకు మీ భర్త ప్రభాస్ ద్వారా ఫేమస్ అయ్యారు..ఇప్పుడు మీరు కూడా ఆయన్ను అడ్డం పెట్టుకుని పాపులర్ అవ్వాలని చూస్తున్నారని కొందరు కామెంట్ చేస్తూంటే..వేణు స్వామి భార్య కూడా ప్రభాస్‌ను వదలడం లేదంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం వేణు స్వామి భార్య ప్రభాస్ గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications