ఫలించిన వేణుస్వామి పూజలు..దెబ్బకు ఆ బ్యూటీ జాతకం మారిపోయిందిగా..!
వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో సెలబ్రిటీల జాతకాలను ఆయన చెబుతున్నారు. ఎవరెవరికి, ఎప్పుడెప్పుడు, ఏం జరగనుందో ఆయన స్పష్టంగా చెబుతున్నారు. వేణుస్వామి చెప్పినట్లుగానే అవి జరుగుతుండటంతో ఆశ్చర్యపోవడం సెలబ్రిటీలతోపాటు ప్రజల వంతైంది.
రష్మిక లాంటి హీరోయిన్లు ఆయన చేత పూజలు చేయించుకొని టాప్ రేంజ్ లో ఉన్నారు. నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటివారు కూడా పూజలు చేయించుకున్నారు. మరికొందరు మాత్రం పూజలు చేయించుకున్నప్పటికీ వివరాలు బహిర్గతం చేయడానికి నిరాసక్తత చూపిస్తున్నారు. జాగా ఆషూ రెడ్డి.. వేణు స్వామి తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆమె బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు రేంజ్ రోవర్ కారు కొంది.

ఇష్టమైన కారు కొనడంతో ఆషూ రెడ్డి తాను బాగా నమ్మే వేణు స్వామి దగ్గరికి వెళ్లి ఆ కారుకు ఆయనచేతే పూజ చేయించుకుంది. వేణుస్వామి ఆ కారుకు పూజ చేసిన వీడియో వైరల్ గా మారింది . టెంకాయ కొట్టిన అనంతరం ఆషూరెడ్డి ఆయన పాదాలకు మొక్కి నమస్కరించింది . "మనల్ని నమ్మి మన పద్ధతులను అనుసరించేవారు ఇలా బాగుపడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది" అంటూ వేణు స్వామి చెప్పారు.
సమంత-నాగచైతన్య విడిపోతారని వేణుస్వామి ఎప్పడో చెప్పారు. అది నిజం కావడంతో గతంలో ఇంకా ఎవరెవరి గురించి, ఏయే విషయాలు వెల్లడించారు, ఎవరి గురించి మాట్లాడారు అంటూ నెటిజన్లు వేణుస్వామికి సంబంధించిన వీడియోలను సెర్చ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications