రష్మిక - విజయ్ దేవరకొండ రిలేషన్ పై వేణుస్వామి జోస్యం

వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీరంగంలో సెలబ్రిటీల గురించి, రాజకీయ రంగంలోని సెలబ్రిటీల గురించి వ్యక్తిగత జాతకాలు చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయారు. సినిమా రంగంలో ఆయనచేత పూజలు చేయించుకున్న రష్మికలాంటివారు నేషనల్ క్రష్ గా ఉండటం, సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పడం.. తర్వాత అదే జరగడంతో గతంలో వేణుస్వామి ఏం చెప్పాడు? ఎవరి గురించి మాట్లాడాడు? అనే విషయాలను నెటిజన్లు సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు.

తాజాగా ఓఛానల్ లో వేణుస్వామి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఆ షోలో యాంకర్ వేణుస్వామిని విజయ్ దేవరకొండ - రష్మిక రిలేషన్ షిప్ గురించి చెప్పమని కోరుతుంది. దీంతో వేణుస్వామి.. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని, వారిద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటున్నారన్నారు.

venuswamy astrology about rashmika and vijay devarakonda

వారి జాతకాలను పరిశీలించిన తర్వాత పెళ్లైన తర్వాత ఇద్దరూ విడిపోతారని ఉందన్నారు. ఇదే విషయాన్ని నేరుగా రష్మికకే చెప్పానని, కానీ ఆమెకు ఈ విషయం నచ్చలేదని, దీనిమీదే తనకు, రష్మికకు మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ గొడవ జరగడానికి ముందువరకు తన క్లైంట్ గా ఉన్న రష్మిక అప్పటి నుంచి దూరాన్ని మెయింటైన్ చేస్తోందన్నారు.

దీంతో నాగచైతన్య-సమంత లా ఈ జంట కూడా వివాహం చేసుకున్న తర్వాత విడిపోతారని వేణుస్వామి చెప్పడంతో మరో జంట కూడా సిద్ధమైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రం చేస్తున్నారు. రష్మిక తాజాగా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక నటిస్తే దాదాపుగా ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ను పరిశ్రమలో క్రియేట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+