అలనాటి స్టార్ హీరోయిన్ కు క్యాన్సర్.. సీక్రెట్ గా ఉంచింది.. కానీ
ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతోంది. పేద, ధనిక తేడా లేకుండా ఈ వ్యాధి చాపకింద నీరులా విజృంభిస్తోంది. అవగాహన లోపంతో ముందస్తు పరీక్షలు చేసుకోకుండా ఈ వ్యాధి ముదిరాక ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించారు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా షర్మిలా ఠాగూర్.. సైఫ్ అలీఖాన్ తో కలిసి కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలోనే ఆమె.. త క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కీలక విషయాలు వెల్లడించారు. తాను నిర్మించి దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాలో షబానా అజ్మీకి బదులు మొదట షర్మిలా ఠాగూర్ ను అనుకున్నామని తెలిపారు. కానీ ఆమె ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇబ్బంది పెట్టలేదన్నారు.
ఇదే విషయంపై మాట్లాడిన షర్మిలా ఠాగూర్.. కొవిడ్ సమయంలోనే తాను క్యాన్సర్ బారిన పడ్డాను.. అందుకే కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. చాలా కఠిన పరిస్థితులను వృద్ధ వయసులో ఎదుర్కున్నానని ఎమోషనల్ అయ్యారు. షర్మిలా ఠాగూర్ కుమార్తె సోహా అలీఖాన్ ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతికొద్దిమంది మహిళలకు వచ్చే లంగ్ క్యాన్సర్ తన తల్లికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన తల్లి క్యాన్సర్ బారినుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఇక షర్మిలా ఠాగూర్ ఇటీవల బెంగాలీ సినిమా పురట్వాన్ లో నటించారు. 2023లో ఆమె గుల్మోహర్ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె మనోజ్ బాజ్ పేయీ సరసన నటించారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. షర్మిలా ఠాగూర్ ప్రస్తుత వయసు 80 ఏళ్లు. ఆమె చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చారు. హిందీ, బెంగాలీ కలిపి కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు. భారతీయ చిత్రసీమకు ఆమె చేసిన సేవలకు గుర్తుగా 2013లో ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. ఆమెకు హిందీ చిత్రపరిశ్రమ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు కూడా ప్రదానం చేసింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications