"ఛావా" ట్రైలర్ గూస్ బంప్స్ .. మరో 1000 కోట్ల మూవీ పక్కా ..!
బాలీవడ్ లో బయోపిక్ లకు ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చారిత్రక అంశాలు, రాజులు, యోధుల కథలను వాళ్లు గతంలో చాలాసార్లు ఆదరించారు. గతంలో రిలీజైన 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'తానాజీ', 'పానిపట్', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' చిత్రాలు బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. తాజాగా ఆ జాబితాలో మరో సినిమా చేరబోతోంది. అదే 'ఛావా'
యుద్ధ వీరుడిగా విక్కీ..
యూరీ: సర్జికల్ స్ట్రైక్, సామ్ బహదూర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. అయితే ఈ సినిమాలో విక్కీ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీగా నటిస్తున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన శంభాజీ భార్య ఏసుభాయి పాత్రలో నటిస్తోంది. ఇటీవల రిలీజైన రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ లో రష్మిక అచ్చం మహారాణి వలె ఆభరణాలు ధరించి హుందాగా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మొత్తం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో వందలాది మంది శత్రువులతో పోరాడే యుద్ధ వీరుడు సాంబాజీగా తన నట విశ్వరూపం చూపించారు విక్కీ కౌశాల్. చూస్తుంటే ఈ మూవీ మరో రూ. 1000కోట్ల మూవీగా నిలువడం ఖాయంగా కనిపిస్తోంది.

సూపర్ హిట్ కాంబో
ఇక ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేఖర్ తెరకెక్కించారు. విక్కీ కౌశల్, లక్ష్మణ్ కాంబోలో గతంలో 'జరా హాట్కే జరా బచ్కే'లో సినిమా విడుదలైంది. 2023లో విడుదలైన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఆడియెన్స్‌ను బాగా అలరించింది. దీంతో ఇప్పుడీ కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం వల్ల ఛావాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను మద్ధోక్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ తెరకెకిస్తోంది. మద్ధోక్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ గతంలో స్త్రీ 2 చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 800కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. స్త్రీ 2 తర్వాత మద్ధోక్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా రూ. 1000కోట్లు కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నారు.












Click it and Unblock the Notifications