పుష్ప-2కు భారీ ఎదురు దెబ్బ..?
సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. 90 శాతానికి పైగా సినిమా పూర్తి అయినట్టు తెలుస్తోంది. తొలుత ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు.

డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజాగా 'పుష్ప-2'రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చారు మేకర్స్.డిసెంబర్ 6న కాకుండా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు.దీనికి సంబంధించిన అఫిషియల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఒకరోజు ముందుగానే బాక్సాఫీస్‌పై పుష్పగాడి దండయాత్ర మొదలుకానుంది. బాలీవుడ్‌లో కూడా 'పుష్ప-2' మంచి బజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే సౌత్ జనాలకంటే నార్త్ ఆడియోన్స్ ఎక్కువగా 'పుష్ప-2' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 'పుష్ప-2'కి పోటీగా మరో సినిమా విడుదల కానుంది.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన 'చావా' అనే సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. 'చావా' అనే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. 'పుష్ప 2' పై భారీ అంచనాలు ఉండటం వల్ల 'చావా' చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేసుకోవాలని భావించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'చావా'డిసెంబర్ 6న విడుదల కానుంది. మహారాష్ట్రలో 'చావా'కి మంచి మార్కెట్ ఉంది. ఛత్రపతి శివాజీ వారసుడి కథ కావడంతో సెంటిమెంటు వర్కౌట్ అయితే జనాలు థియేటర్స్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. దీంతో 'చావా'ద్వారా 'పుష్ప-2'కి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications