వెంకీ లీక్స్.. మెగాస్టార్ సినిమాలో అలాంటి పాత్ర చేస్తున్నా !
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాణం అయిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.
ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే యూఎస్ (USA)లో ఘనంగా జరిగిన నాట్స్-2025 కార్యక్రమంలో వెంకటేష్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన తన రాబోయే సినిమాల గురించి మాట్లాడారు. దాంతో వెంకీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో రోజులుగా చిరంజీవి సినిమాలో వెంకటేష్ కనిపించబోతున్నారని వస్తున్న వార్తలను ఆయన అధికారికంగా ధృవీకరించారు. అంతే కాకుండా ఆ పాత్ర ఎలా ఉంటుందో కూడా వెల్లడించారు.

మెగా 157..
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. చిరు సరసన నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నానని వెంకటేష్ రివీల్ చేశారు. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. ప్రేక్షకులు కూడా ఊహించలేని విధంగా ఆ పాత్ర ఉంటుందన్నారు. అంతేకాదు ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది అని తెలిపారు.
వెంకటేష్ తన సినిమాల గురించి మాట్లాడుతూ..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని వెల్లడించారు. అలానే 'దృశ్యం' సీక్వెల్ లో మీనాతో కలిసి నటిస్తున్నానని తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు.
మరోవైపు తన స్నేహితుడితో కలిసి మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను" అంటూ వెంకటేష్ సస్పెన్స్ లో పెట్టారు. తన స్నేహితుడు ఒక పెద్ద స్టార్ అని చెప్పడంతో, ఇప్పుడు ఆ హీరో ఎవరు? ఏ జానర్‌లో సినిమా చేస్తున్నారు? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications