మెగా ఇంటికి కోడలు అనుకుంటే..ఇలా చేసింది ఏంటీ..!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. సరిగ్గా ఇదే బాటలో పయనిస్తోంది హీరోయిన్ రీతూ వర్మ.తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో రీతూ వర్మ కూడా ఒకరు. 1990 మార్చి 10న హైదరాబాదులో జన్మించిన రీతూ వర్మ మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
"అనుకోకుండా" అనే షార్ట్ ఫిలిం ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న రీతూ వర్మ , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన "పెళ్ళి చూపులు" సినిమాతో రీతూ వర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నటించిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో రీతూ వర్మకు వరుస అవకాశాలు దక్కాయి. పెళ్ళి చూపులు,కేశవ ,అర్జున్ రెడ్డి,టాక్సీవాలా ,జర్సీ ,కనులు కనులను దోచాయంటే,వరుడు కావలెను ,టక్ జగదీష్ ,ఆడవాళ్ళు మీకు జోహార్లు వంటి సినిమాల్లో రీతూ వర్మ నటించింది.

ఆ మధ్య లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ వివాహ సమయంలో వారితో కనిపించి అందరికి షాకిచ్చింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో రీతూ వర్మ డేటింగ్ చేస్తోందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే రీతూ వర్మ లావణ్య త్రిపాఠి స్నేహితులని తర్వాత తేలింది. దీంతో మెగా హీరోతో రీతూ వర్మ డేటింగ్ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టు అయింది.తాజాగా రీతూ వర్మకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
హీరో సందీప్ కిషన్‌తో రీతూ వర్మ ముద్దు పెట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు కలిసి ప్రస్తుతం 'మజాకా' అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లవర్స్ డే స్పెషల్‌గా హీరో, హీరోయిన్లు ఓ వీడియో చేశారు.రీతూ వర్మ బుగ్గలపై సందీప్ కిషన్ ముద్దులతో ముంచేస్తున్నాడు.ఫైనల్‌లో హ్యాపీ వాలైంటెన్స్ డే అని తెలియజేశారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications