విడాకుల వేళ విజయ్, త్రిష వీడియో వైరల్.. ఒకే కారులో..

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఇటీవల సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ సంక్రాంతి కి రిలీజ్ కావాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితమే విజయ్ భార్య సంగీత.. అతడి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.

Vijay and Trisha in Same Car at chennai Wedding Viral Video Fuels Divorce Rumors amp amp Fan Frenzy

విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని కీలక ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే విజయ్- సంగీత విడాకుల వేళ ఇప్పుడు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్- త్రిష తాజాగా ఒకే కారులో ఓ వివాహ ఫంక్షన్ కు వెళ్లారు. చెన్నైలో కళాపతి ఎస్ సురేశ్ కొడుకు వివాహ రిసెప్షన్ కు విజయ్.. త్రిషతో కలిసి వెళ్లారు. ఇలా ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వేడుకకు విజయ్, త్రిష ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. విజయ్ సిల్క్ షర్ట్, ధోతీ ధరించారు. ఇక త్రిష కూడా అదే కలర్ మ్యాచింగ్ చీరలో కనిపించారు. ఈ వివాహ వేడుకలో విజయ్- త్రిష చాలా సంతోషంగా కనిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ భార్య సంగీత పేర్కొన్న నటి త్రిషేనని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇక త్రిష కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్- త్రిష జోడీ సరైందిగా చెబుతుంటారు. వీరి కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్‌ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం విజయ్, త్రిష విదేశాలకు విహారయాత్రకు వెళ్లారంటూ కొన్ని ఫోటోలు సంచలనం సృష్టించాయి. మరి తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+