విజయ్ "కింగ్‌డమ్"లో కొత్త విలన్ ఎవరంటే.. రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'కింగ్‌డమ్'. మళ్లీ రావా, 'జెర్సీ' వంటి నేచురల్ క్లాసిక్ హిట్లు అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించగా.. సత్యదేవ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
విజయ్ గత చిత్రాలు 'లైగర్', 'ఖుషి' ఆశించిన స్థాయి విజయాన్ని సాధించకపోవడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సౌండ్‌ట్రాక్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది.

ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ గమనిస్తే విజయ్ కి ధీటుగా విలన్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఆ కొత్త వ్యక్తి ఎవరా అని తెలుగు ప్రేక్షకులులు తెగ వెతికేస్తున్నారు. అతను ఎవరు ? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..
మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి...
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించింది మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి. 1993 ఆగస్టు 9న కేరళలోని త్రివేండ్రంలో జన్మింcharu. 2018లో "నాయక నాయకన్" టాలెంట్ హంట్ షో ద్వారా మలయాళ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత 2017లో "వెలిపాడింటే పుస్తకం" సినిమా ద్వారా చిన్న పాత్రతో సినీ రంగంలో అడుగుపెట్టాడు. అనంతరం "ఒడియన్" (2018) సినిమాలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు.
అయితే ఆయనకు అసలైన గుర్తింపు 2019లో వచ్చిన "స్టాండ్ అప్" చిత్రంతో వచ్చింది. 2021లో విడుదలైన "ది ప్రీస్ట్", "ఖో ఖో" సినిమాల్లో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 2023లో వచ్చిన "లవ్‌ఫుల్లీ యువర్స్ వేద" కూడా మంచి స్పందన తెచ్చిపెట్టింది. కాగా ఇటీవల 2024లో జీవీ ప్రకాశ్ "రెబెల్" సినిమాలో విలన్‌గా మెప్పించాడు.

ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసే 'కింగ్‌డమ్'లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో కూడా అతని విలనిజం కొత్తగా అనిపిస్తోందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం కోసం ఆయనకు మంచి పారితోషకమే ఇచ్చినట్టు సమాచారం. కాగా వెంకటేశ్ గనుక తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే టాలీవుడ్‌కు ఒక కొత్త విలన్ దొరికినట్టేనని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications