నో ఫోన్ ప్లీజ్: విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి ఫొటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహంపై చాలా కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట తమ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ- ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న పెళ్లి సందడి ఆరంభం కానుంది. 24, 25 తేదీల్లో సంగీత్, హల్దీ పంక్షన్లు జరుగుతాయి. 26న సంప్రదాయబద్ధంగా రష్మిక మందన్న మెడలో తాళి కట్టనున్నాడు విజయ్.
విజయ్ దేవరకొండ ఈ వివాహ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచుతున్నాడు. తమ ప్రైవసీకి ఎటువంటి భంగాన్ని కలిగించకుండా ఉండటంతో పాటు దీన్ని వాణిజ్యపరంగా మార్చడానికి కాబోయే దంపతులిద్దరు ఎంతమాత్రం సుముఖంగా లేరని, ఇది వ్యక్తిగత వేడుకగానే ఉండాలని విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.వారి పెళ్లికి సెలబ్రిటీలు, అతిథులు కూడా పెద్దగా ఉండబోరని, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.

అక్కడితో ఆగట్లేదు. ఈ వెడ్డింగ్ కు సంబంధించిన ఏ ఒక్క ఫొటో గానీ, వీడియోలు గానీ బయటికి రాకుండా చర్యలు తీసుకుంటోన్నారు. దీనికోసం నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నారు. ఫోన్లను తీసుకుని రావడానికి అనుమతి ఇస్తే.. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్ అవుతాయని, అది తమ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని విజయ్- రష్మిక భావిస్తోన్నారు. పెళ్లికి వచ్చే వాళ్లు తమ వెంట ఫోన్లను తీసుకుని రాకూడదని కోరుతున్నట్లు ఇండియా టుడే తెలిపింది.
ఇతర సెలబ్రిటీ వివాహాలకు భిన్నంగా- ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, సహచరులెవరూ ఆహ్వానించట్లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. విజయ్, రష్మిక స్నేహితులకు లేఖలు కూడా రాశారు. గిఫ్టులను తీసుకుని రావొద్దని, ఆశీస్సులు మాత్రమే అందజేయాలని కోరారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీని తర్వాత నెల రోజుల పాటు సినిమాల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి, విదేశాలకు వెళ్తారని తెలుస్తోంది.
-
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు












Click it and Unblock the Notifications