ఓ మెట్టు ఎక్కేశావయ్యా.. సొంతూరు కోసం విజయ్ ఏం చేయబోతున్నారంటే ??
యంగ్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26 ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో నిర్వహించారు. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. మరీ ముఖ్యంగా ఈ వివాహ వేడుక విజయ్ తెలుగు సంప్రదాయాలను, రష్మిక కూర్గ్‌లోని కొడవ వలస వారసత్వాన్ని కలిపి.. రెండు విభిన్న సాంస్కృతిక గుర్తింపుల అందమైన సమ్మేళనంగా జరుపుకున్నారు.
కాగా ఈ కొత్త పెళ్లి జంట ఇటీవలే హైదరాబాద్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

అయితే తన పెళ్లి తర్వాత మొదటిసారి భార్య రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మెన్‌పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి, గ్రామస్థులందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సొంతూరిలో ఇల్లు కట్టుకోవాలని మా నాన్న కల కనేవారు.. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నా పెళ్లి జరగడం, అదే సమయంలో ఇల్లు పూర్తికావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
అలానే ఇకపై ఊరికి రెగ్యులర్‌గా వస్తానని.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా గ్రామస్థులందరి సమక్షంలో ఇక్కడే ఘనంగా చేస్తానని మాటిచ్చారు. ఇక 'దేవరకొండ ఫౌండేషన్' ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్‌కు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో విజయ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అన్నదానం..
మరోవైపు మార్చి 1(ఆదివారం) ఈ విజయ్ - రష్మిక జంట అన్నదానం, స్వీట్ల పంపిణీ చేశారు . స్వీట్ల రూపంలో తమ ప్రేమని పంచుతున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేశారు.
-
"ఇకపై పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది" -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
రజనీకాంత్, ధనుష్‌లకు పొరుగున.. కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్! -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
ఇంటెన్స్ కోర్టు డ్రామాతో మెంటలెక్కించేశారుగా..! -
ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?











Click it and Unblock the Notifications