ఓటీటీ మారిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్; స్ట్రీమింగ్ ముహూర్తం ఫిక్స్!!

విజయ్ దేవరకొండ,మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ స్టార్ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ స్టార్ నేడు థియేటర్లలో సందడి చేస్తుంది. గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అవసరం
ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ టాక్ రావడంతో, ఈ సినిమా అయినా సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండకు కూడా ఫ్యామిలీ స్టార్ సక్సెస్ కావడం చాలా అవసరం.

vijay devarakonda family star OTT changed and streaming muhurat fixed

ఓటీటీ లో రిలీజ్ .. ముహూర్తం ఫిక్స్
తాజాగా నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, అయితే సినిమా ఊహించినంతగా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదని తాజాగా వస్తున్న రివ్యూలను బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి కూడా అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అందులో కాదు
విజయ్ దేవరకొండ పరుశురాం పెట్ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఓటిటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడు అయినట్లుగా సమాచారం. ఈ సినిమా ఓ టి టి స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని మొదట ప్రచారం జరిగింది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఫ్యామిలీ స్టార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం లేదు. ఫ్యామిలీ స్టార్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చెయ్యలేదు.

వచ్చే నెలలో అప్పుడే.. అందులో ఫ్యామిలీ స్టార్
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే థియేటర్లో సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమా ఓ టి టి లో వచ్చే నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మే నెల రెండో వారంలో లేదా మూడో వారంలో ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లోనే కాదు, ఓటీటీలోనూ అభిమాన హీరో సినిమా చూసేందుకు రెడీ అయిపోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+