కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటించారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది. దిల్ రాజు నిర్మాత. ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్‌'సినిమాతో కుటుంబ ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. 'రాజావారు రాణిగారు'తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవికిరణ్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన విజయ్‌తో సినిమా తీయనున్నట్లు పోస్ట్‌ చేయడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ బ్యానర్‌లోనే సినిమా తీయబోతున్నట్లు రవికిరణ్ ప్రకటించారు. అప్పటి నుంచి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీనిపై అనేకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వాటికి చెక్‌ పెడుతూ వివరాలు వెల్లడించారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పూర్తి వివరాలను విజయ్ పుట్టినరోజు మే 9న ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సితార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్ర పోషించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది.

vijay devarakonda new movie director ravikiran

లైగర్ సినిమా పరాజయం పాలైన తర్వాత విజయ్ దేవరకొండ అయోమయంలో పడ్డారు. ఎటువంటి కథను ఎంచుకోవాలి? ఏ తరహాలో సినిమా తీస్తే అభిమానులను ఆకట్టుకుంటాం అనే విషయంలో కొంత సందిగ్ధతకు లోనయ్యారు. కొంత సమయం తీసుకొని సమంత కథానాయికగా ఖుషి సినిమా చేశారుకానీ అది అనుకున్నంత స్థాయిలో హిట్ అవలేదు. తర్వాత విడుదలైన ఫ్యామిలీస్టార్ ఫ్లాపైంది. దర్శకుడు సుకుమార్ విజయ్ తో సినిమా తీయనున్నట్లు ప్రకటించారుకానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో మిడ్ రేంజ్ దర్శకులతోనే విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+