యుఎస్‌లోని స్టార్ హోటల్‌లో డిన్నర్‌కి వెళ్లిన విజయ్ దేవరకొండ...
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు సొంతం అయ్యాడు ఈ రౌడీబాయ్. అర్జున్‌రెడ్డితో యూత్‌ను ఎంతగానో ఆకట్టకున్నాడు విజయ్. తన స్టైల్‌తో, నటనతో కుర్రకారును తనవైపుకు తిప్పుకున్నాడు ఈ యంగ్‌స్టార్. గీతగోవిందం వంటి సినిమాతో ఫ్యామిలీస్‌కు కూడా దగ్గరయ్యాడు. విజయ్‌దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో బిజిగా ఉన్నారు.
అమెరికాలోని న్యూజెర్సీలో ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ : ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడి రెస్టారెంట్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ మొన్నటి వరకూ ఢిల్లీలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూ జెర్సీలో జరుగుతోంది. షూటింగ్ అనంతరం బయటికివెళ్లిన విజయ్ డిన్నర్‌కు ఓ స్టార్ హోట్‌ల్‌కు వెళ్లాడు. అయితే, విజయ్ దేవరకొండ అక్కడ దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పడు సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

Dinner Night at New York 🥂🍝
— Suresh PRO (@SureshPRO_) December 16, 2023
The #VijayDeverakonda shared the moment straight from the US Trip.#FamilyStar @TheDeverakonda pic.twitter.com/FbdwOrX3tX
'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన 'గీత గోవిందం' ఎంతటి విజయాన్ని అందించిందో అందరికి తెలిసిందే. ఒక మంచి ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించిన గీత గోవిందం సినిమా విజయ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక, ఈ చిత్రంలో రష్మిక మందన్నా కూడా కనిపించనున్నట్లు అప్పట్లో సోషల్‌మీడియాలో ప్రచారమయ్యింది. ఇది గనుక నిజమైతే ఇక, విజయ్ అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి.












Click it and Unblock the Notifications