విజయ్ దేవరకొండ - రష్మిక వెడ్డింగ్ వెనుక పెద్ద కథే ఉంది మాస్టారు..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ పేర్లు వింటేనే వెండితెరపై ఒక తెలియని మ్యాజిక్ కనిపిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ పంచుకున్న ఒక వెడ్డింగ్ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా సినిమాల్లో పెళ్లి ఫోటోలు అంటే మిరుమిట్లు గొలిపే లైటింగ్, భారీ సెట్టింగ్‌లు ఉంటాయి. కానీ 'రణబాలి' వెడ్డింగ్ పోస్టర్ ఇందుకు పూర్తి భిన్నం. అది ఒక ఫోటో లాగా కాకుండా, 1800 నాటి కాల గర్భం నుంచి బయటకు వచ్చిన ఒక సజీవ జ్ఞాపకంలా ఉంది. దీనిపై దర్శకుడు రాహుల్ స్పందిస్తూ.. ఆ కాలంలోని సహజత్వాన్ని, నిజాయితీని పట్టుకోవడమే తన ప్రయత్నమని తెలిపారు. ఆ ఫోటో కేవలం షూటింగ్ కోసం తీసింది కాదు, అది ఒక కాలపు ఆనవాళ్లు" అని ఆయన పేర్కొనడం సినిమాపై ఉన్న అంకితభావాన్ని చాటుతోంది.

Vijay Deverakonda and Rashmika Mandanna Ranabali Movie The Viral Wedding Poster Story

ఈ చిత్రంలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య కాలంలో, బ్రిటిష్ పాలన నాటి యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆ కాలం నాటి గ్లామర్ లేని, కానీ గౌరవం నిండిన జీవనశైలిని ప్రతిబింబించేలా వీరిద్దరి వేషధారణ ఉంది. సెట్‌లోకి వీరు ఆ దుస్తుల్లో వచ్చినప్పుడు, ఒకరు రౌడీ స్టార్‌లా, మరొకరు నేషనల్ క్రష్‌లా కాకుండా.. నిజంగానే ఆ కాలం నాటి దంపతుల్లా కనిపించారట.

విజయ్-రష్మికల గురించి వినిపించే రూమర్ల నేపథ్యంలో, చిత్ర యూనిట్ పెళ్లి పాటను విడుదల చేయడం విశేషం. ఇది కేవలం సినిమాలో పాట మాత్రమే కాదు, వీరిద్దరి నిజ జీవిత బంధంపై వస్తున్న వార్తలకు ఒక రకమైన స్వీట్ సర్ ప్రైజ్ లా అనిపిస్తోంది. "జీవితం, సినిమా కొన్నిసార్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి" అని డైరెక్టర్ చెప్పిన మాటలు అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.'రణబాలి' కేవలం ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఒక కాలం నాటి భావోద్వేగాల ప్రయాణం అని అర్థమవుతోంది. రౌడీ స్టార్ గంభీరత, రష్మిక అమాయకత్వం తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో 'గీతా గోవిందం' రేంజ్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+