ఓటీటీలో విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వీడియో ఫుటేజీకి హ్యూజ్ డిమాండ్:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహంపై చాలా కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట తమ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ- ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వీడియో హక్కుల కోసం వచ్చిన ఓ భారీ ఓటీటీ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న తిరస్కరించినట్లు సమాచారం. ఈ డీల్ విలువ 60 కోట్ల రూపాయలు.
పెళ్లి వీడియోల ఎక్స్ క్లూజివ్ ఫుటేజీ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇటీవల ఈ జంటను సంప్రదించింది. వారి వివాహ వీడియోకు సంబంధించిన ప్రత్యేక హక్కులను కొనుగోలు చేయడానికి 60 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. దీన్ని విజయ్ దేవరకొండ- రష్మిక తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార వివాహ వీడియో వివాదం సమయంలో తలెత్తిన చట్టపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకొని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ తమ వివాహ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచడానికి చాలా ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. తమ ప్రైవసీకి ఎటువంటి భంగాన్ని కలిగించకుండా ఉండటంతో పాటు దీన్ని వాణిజ్యపరంగా మార్చడానికి కాబోయే దంపతులిద్దరు ఎంతమాత్రం సుముఖంగా లేరని, ఇది వ్యక్తిగత వేడుకగానే ఉండాలని విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
వారి పెళ్లికి సెలబ్రిటీలు, అతిథులు కూడా పెద్దగా ఉండబోరని, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా, రష్మిక- విజయ్ ఇటీవల న్యూ ఇయర్‌ను కలిసి జరుపుకోవడానికి రోమ్‌కు వెళ్లారు. ఇద్దరు స్టార్లు తాము కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు నేరుగా ప్రకటించనప్పటికీ, ఒకే చోట్ల నుండి ఫోటోలు పంచుకోవడంతో వారిద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. గీత గోవిందం చిత్రం నుండి మొదలైన వీరి బంధం పెళ్లి పీటలకు దారి తీసింది. గత ఏడాది అక్టోబర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications