విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్..ఏంటీ ఈ అపశకునం

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో సాయంత్రం వేళ అపశ్రుతి చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ వార్త విని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి వద్ద ఈ ఘటన జరిగింది. విజయ్ కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది.

Vijay Deverakonda s Narrow Escape Car Accident in Gadwal District Days After Rashmika Engagement

ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే, విజయ్ తన కారు దిగి, అక్కడే ఉన్న తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఈ ఘటనపై ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బొలెరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రెండు రోజుల క్రితమే హీరోయిన్ రష్మికను నిశ్చితార్థం చేసుకున్నారు.రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+