leo movie review: 'లియో' రివ్యూ.. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్?

సినిమా పేరు: లియో
తారాగణం: విజయ్, త్రిష,సంజయ్ దత్ ,అర్జున్, గౌతమ్ మీనన్ తదితరులు
సంగీతం:అనిరుధ్ రవిచందర్
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు:లలిత్ కుమార్,జగదీష్
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా వరుసగా విడుదలవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లియో ఎలా ఉందంటే..?

Vijay-Lokesh Kanagaraj combination movie Leo review

కథ.. లియో ఎవరు : పార్తి (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్ లో స్థిరపడిన తెలుగువాడు. ఓ కేఫ్ నడుపుకుంటూ 20 సంవత్సరాలుగా అక్కడే జీవనం సాగిస్తుంటాడు. అతనికి భార్య, బాబు, పాప ఉంటాయి. హాయిగా సాగుతున్న అతని జీవితం ఓ ముఠావల్ల తల్లకిందులవుతుంది. తన కేఫ్ లోకి ఓ రాత్రివేళ వచ్చి డబ్బులు దోచుకువెళ్లే ప్రయత్నం చేస్తే ఆ ముఠాను అక్కడికక్కడే కాల్చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేయగా, ఆత్మరక్షణ కోసమే వారిని చంపినట్లు తేలడంతో విడుదల చేస్తారు.

అయితే ఓ వార్తాపత్రికలో అతని ఫొటో చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ పార్తిని పట్టుకునేందుకు హిమాచల్ బయలుదేరుతుంది. 20 సంవత్సరాల క్రిందట కనిపించకుండా పోయిన ఆంటోనిదాస్ కొడుకు లియోలా పార్తి ఉంటాడు. లియో ఎవరు? పార్తిబన్.. అతను ఒక్కరేనా? ఇద్దరా? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని అన్న హెరాల్డ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తుంటారు? వీరిమధ్య వైరం ఏమిటి? అనేది తెరపై చూసి నేర్చుకోవాలి.

Vijay-Lokesh Kanagaraj combination movie Leo review

ఎలా ఉందంటే : ఈ కథలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సీన్లు మూడు, నాలుగు మినహా సినిమా అంతా వేరే కథ. హైనాతో తలపడే యాక్షన్ సన్నివేశంతో పార్తిబన్ పాత్రలో విజయ్ ను దర్శకుడు పరిచయం చేస్తాడు. ఈ ఎపిసోడ్ ఫస్టాఫ్ కు బలం. అతను, అతని కుటుంబాన్ని చూపించడంతో సినిమా అత్యంత నిదానంగా సాగుతున్నట్లనిపిస్తుంది. కేఫ్ లోకి ముఠా రావడం, వారందరినీ కాల్చి చంపడం ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.

Vijay-Lokesh Kanagaraj combination movie Leo review

ఆంటోని దాస్ పాత్రలో సంజయ్ దత్, హెరాల్డ్ దాస్ పాత్రలో అర్జున్ ను దర్శకుడు పరిచయం చేస్తాడు. ఈ సన్నివేశాలు మెప్పిస్తాయి. తొలిసారి పార్తీ, ఆంటోనీ ఎదురుపడే సన్నివేశాలు బాగుంటాయి. తర్వాత పార్తీ, ఆంటోనీకి మధ్య వచ్చే ఛేజింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో ఆంటోని గ్యాంగ్ ను ట్రాప్ చేసి పార్టీ చంపేస్తాడు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విక్రమ్, ఖైదీ సినిమాల్లో ఉన్నంత మెరుపు లియోలో కనిపించదు.

ఎలా చేశారంటే : విజయ్ లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. లియోగా విలన్ ఛాయలున్న పాత్రల్లో చక్కటి హీరోయిజాన్ని చూపించారు. తల్లి పాత్రలో త్రిష బాగా చేసింది. విజయ్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఆంటోనీదాస్, హెరాల్డ్ దాస్ పాత్రను ముగించిన తీరు మాత్రం సంతృప్తి కలిగించదు.

Vijay-Lokesh Kanagaraj combination movie Leo review

తగ్గిన డోసు : తన కథలో ఈసారి యాక్షన్ డోస్ తగ్గించి ఫ్యామిలీ టచ్ ఇచ్చే ప్రయత్నం లోకేష్ చేశారు. రెండో భాగం సాగతీతలా అనిపిస్తుంది. సంజయ్ దత్ వ్యవహారశైలి, అనుసరించే పద్ధతులు ఎవరినీ ఆకట్టుకోవు. సినిమా చివర్లో విక్రమ్ (కమల్) లియోకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించారు కానీ అది కిక్ ఇవ్వదు. కానిస్టేబుల్ నెపోలియన్ పాత్ర మాత్రం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. అనిరుధ్ నేపథ్య సంగతం బాగుంది. కారు ఛేజింగ్ సీన్స్, దాస్ గ్రూప్ ను లియో తగలబెట్టే ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ వావ్ అనిపిస్తాయి. ప్రతి యాక్షన్ సీన్ చాలా విభిన్నంగా ఉండేలా దర్శకుడు డిజైన్ చేసుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+