నీ ఆస్తులు మొత్తం ఆమెకే రాసిచ్చావా ..! విజయ్ కంటే భార్యకే ఎక్కువ ఆస్తులు!!

కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత 25 ఏళ్లుగా విజయ్ నీడలా ఉంటూ, మీడియాకు దూరంగా ఉన్న సంగీత ఇప్పుడు వార్తల్లో నిలిచారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సంగీత నేపథ్యం, ఆమె ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎవరీ సంగీత?
విజయ్ సతీమణి సంగీత శ్రీలంకకు చెందిన తమిళురాలు. ఆమె తండ్రి స్వర్ణలింగం లండన్‌లో స్థిరపడిన ఓ పెద్ద పారిశ్రామికవేత్త. సంగీత పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా లండన్‌లోనే. 1996లో 'పూవే ఉనక్కాగ' సినిమా విజయం తర్వాత విజయ్‌ను అభినందించడానికి లండన్ నుంచి చెన్నై వచ్చిన సంగీత, ఆ తర్వాత ఆయనతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.

Vijay-Sangeetha Divorce Sangeetha 400 Cr Wealth and Shocking Allegations Is Star Heroine Involved

రూ. 400 కోట్ల ఆస్తిపాస్తులు!
సంగీత కేవలం విజయ్ భార్య మాత్రమే కాదు, ఆమెకు సొంతంగా భారీ ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆమె తండ్రి లండన్‌లో పెద్ద వ్యాపారవేత్త కావడంతో, సంగీతకు సుమారు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇది విజయ్ సంపాదించిన ఆస్తి కాదు, ఆమెకు తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ సంపద.పెళ్లికి ముందే ఆమె కోటీశ్వరురాలు కావడంతో, ఆర్థికంగా విజయ్‌పై ఆధారపడాల్సిన అవసరం ఆమెకు ఎప్పుడూ రాలేదు. లండన్‌లో ఆమెకు అనేక స్థిరాస్తులు, వ్యాపార పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్‌పై సంగీత చేసిన షాకింగ్ ఆరోపణలు
విడాకుల పిటిషన్‌లో సంగీత పేర్కొన్న అంశాలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. ఏప్రిల్ 2021లో విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని తనకు తెలిసిందని.. అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు తనపై ఆంక్షలు విధించారని, తన హక్కులను కాలరాశారని ఆమె ఆరోపించారు. తనను ఒంటరిగా ఉండమని విజయ్ ఒత్తిడి చేశారని తెలిపారు. సదరు నటితో విజయ్‌కు ఉన్న సంబంధానికి సంబంధించి తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని కోర్టుకు సమర్పిస్తానని ఆమె హెచ్చరించారు. ఆ నటిని ఈ కేసులో రెండో ప్రతివాదిగా చేరుస్తానని కూడా తెలిపారు.

సదరు నటి విజయ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల తన పిల్లలు మానసిక క్షోభకు గురవుతున్నారని, విజయ్ దీనిని ఖండించకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ యూనివర్సిటీలో చదువుకుని, భారీ ఆస్తులు ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ 'హోమ్ మేకర్‌'గా తన పిల్లల ఎదుగుదలపైనే దృష్టి పెట్టిన సంగీత, ఇప్పుడు న్యాయపోరాటానికి దిగడం చర్చనీయాంశంగా మారింది.

ఆ హీరోయిన్ ఎవరు?
సంగీత తన పిటిషన్ లో సదరు నటి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. నెటిజన్లు, రాజకీయ వర్గాలు చూపు మాత్రం ప్రముఖ హీరోయిన్ త్రిష వైపు మళ్లుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొందరు బీజేపీ నేతలు నేరుగా త్రిష పేరును ప్రస్తావించి విజయ్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష మత్తు నుంచి బయటకు రావాలని కామెంట్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. త్రిష మాత్రం ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమని హెచ్చరికలు చేయడం గమనార్హం. విజయ్, త్రిషల ఫోటోలు వైరల్ కావడం.. విజయ్ పుట్టినరోజున త్రిష ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం వంటివి ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+