కాకినాడ శ్రీదేవి వీడియో వైరల్..
ఇండస్ట్రీలో యువ నటీనటులకు గుర్తింపు రావాలంటే చాలా సమయం పడుతుంది. పదుల సంఖ్యలో సినిమాలు చేశాకనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే తొలి సినిమాతోనే మ్యాజిక్ చేసింది కాకినాడ శ్రీదేవి. ఒక్క సినిమాతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించిందీ బ్యూటీ. కాకినాడ శ్రీదేవి అంటే ఎవరూ గుర్తుపట్టరేమో గానీ.. కోర్టు మూవీ జాబిలి అంటే మాత్రం అందరికీ గుర్తొస్తుంది. కోర్టు మూవీతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కాకినాడ శ్రీదేవి. ఇప్పుడు ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
కోర్టు మూవీతో తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది శ్రీదేవి. ఈ మూవీలో జాబిలి పాత్రలో మెరిసి మెప్పించింది శ్రీదేవి. ఇక ఈ మూవీలో హీరోగా హర్ష్ రోషన్ నటించాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా.. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కోర్టు మూవీ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధమైంది.

హర్ష్ రోషన్, శ్రీదేవి కాంబోలో బ్యాండుమేళం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రిలీజైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. ఈ టీజర్ లో తెలంగాణ యాసతో శ్రీదేవి వావ్ అనిపించింది. ఈ మూవీని సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా కాకినాడ శ్రీదేవి ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications