ఈ వయస్సులో ఆ గ్రేస్ ఏంటండీ.. ఒకప్పటి స్టార్ బ్యూటీ వీడియో వైరల్ !
అలనాటి అందాల తార కల్పనా అయ్యర్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. దాదాపు 45 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ను ఊపేసిన 'అర్మాన్' (1981) సినిమాలోని 'రంభ హో' పాటతో అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన ఈ నటి.. తాజాగా ఒక పెళ్లి వేడుకలో అదే పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఏకంగా 70 ఏళ్ల వయసులోనూ ఆమె చూపించిన ఎనర్జీ, ఫిట్‌నెస్, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఏజ్ జస్ట్ ఏ నంబర్" అనే మాటకు కల్పనా అయ్యర్ సజీవ ఉదాహరణ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
'రంభ హో' - అప్పట్లో సెన్సేషన్..
1981లో విడుదలైన 'అర్మాన్' సినిమాలోని 'రంభ హో' పాట అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పాటలో కల్పనా అయ్యర్ అందం, డాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చాయి. ఆ కాలంలో ఐటమ్ సాంగ్స్‌కు ఇంత క్రేజ్ ఉండేది కాదు. అయినా సరే, కల్పనా అయ్యర్ ఆ పాటతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, అదే పాటకు ఆమె మళ్లీ నృత్యం చేయడం అభిమానులకు నాస్టాల్జియా ఫీలింగ్‌ను తీసుకొచ్చింది.

పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్..
తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో కల్పనా అయ్యర్ 'రంభ హో' పాట వినిపించగానే స్టేజ్‌పైకి వచ్చి డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును లెక్కచేయకుండా, కాన్ఫిడెన్స్‌తో స్టెప్పులేయడం అక్కడున్న అతిథులను మంత్ర ముగ్ధులను చేసింది. ఆ వీడియోను అక్కడున్నవారిలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), ఫేస్‌బుక్‌లలో లక్షల వ్యూస్, వేల లైక్స్, షేర్లు వస్తున్నాయి.
ఇదే నిజమైన గ్రేస్..
కల్పనా అయ్యర్ డాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఇంత ఎనర్జీనా!".. నిజమైన స్టైల్, నిజమైన గ్రేస్ అంటే ఇదే.. మళ్లీ యూత్ రోజులు గుర్తొచ్చాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే "ఈరోజు హీరోయిన్స్ కూడా ఇంత గ్రేస్ చూపించలేరు" అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కల్పనా అయ్యర్ కేవలం ఒక ఐటమ్ సాంగ్‌తోనే కాదు, తన డిసిప్లిన్, ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్‌తో కూడా ఇప్పటి తరం మహిళలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ ఈవెంట్స్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications