తెలుగు స్టార్ హీరోకి విరాట్ కోహ్లి పెద్ద అభిమాని.. అతనెవరో తెలుసా?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులుంటారు. అయితే అటువంటి కోహ్లీ కూడా తెలుగులో ఒక స్టార్ హీరోకు పెద్ద అభిమాని. అంతేకాదు.. అతనితో మంచి స్నేహం కూడా ఉంది. అతడెవరో కాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తారక్ అంటే కోహ్లీకి బాగా ఇష్టం. తారక్ సినిమాలు తాను చూస్తుంటానని, అతని నటన, అతని వ్యక్తిత్వం తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తెలుగు పాటలు వింటుంటానని చెప్పారు.

ఆస్కార్ అవార్డు రావడం గర్వకారణం
ఓ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం జరిగిందని, అతని మాటతీరు, వ్యక్తిత్వం తనను బాగా ఆకట్టుకున్నాయని విరాట్ చెప్పారు. హావభావాలు అద్భుతంగా పలికిస్తాడని, నృత్యం బాగా చేస్తాడని, ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం గర్వకారణంగా ఉందన్నారు. అంతేకాదు.. ఆ సినిమాలో తారక్ నటన అద్భుతంగా ఉంటుందన్నాడు. రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ ను కలిశానని, అప్పటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమైనట్లు తెలిపాడు. తన నుంచి ఏయే సినిమాలు వస్తున్నాయనేది గమనిస్తుంటానన్నారు. అలాగే తమిళంలో తనకు ఇష్టమైన నటుడు శింబు అని చెప్పారు. విరాట్ చెప్పిన మాటలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో తమ హీరో నటించినట్లుగా ఎవరూ నటించలేరన్నారు.

Virat Kohli is a big fan of Telugu star hero Do you know who is he

వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న కోహ్లి
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు కోహ్లి సిద్ధమవుతున్నాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రస్తుతం లండన్ లో చేస్తున్నాడు. వన్డే సిరీస్ తో క్రికెట్ లోకి పునరాగమనం చేయనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడిన తర్వాత ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్ ఒక్కటి కూడా ఆడలేదు. అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ తో పూర్తిగా ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు. ఈ సిరీస్ లో కనుక విఫలమైతే వన్డే మ్యాచ్ లో కొనసాగడం అనేది దాదాపుగా అనుమానమే అవుతుంది. కోచ్ గౌతమ్ గంభీర్ కచ్చితంగా వేటు వేసి కొత్తవారిని తీసుకుంటాడు. అందుకే జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+