విజయ్ - రష్మిక వెడ్డింగ్ వైబ్స్.. ఈ వైరల్ ఫోటోల్లో అది గమనించారా ??
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరూ ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్నారు. ఫిబ్రవరి 23నే ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఇప్పటికే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా పెళ్లి హందీ, సంగీత్ సందడిగా జరిగినట్లు తెలుస్తోంది. సంగీత్‌లో విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమాల్లోని ఫొటోలు.. ఫ్రేమ్‌లతో డెకరేషన్ చేసినట్టు పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ అభిమానులు వీరిద్దరినీ ట్యాగ్ చేస్తున్నారు.

అలానే సంగీత్‌లో భాగంగా ఇరు కుటుంబాలు సరదాగా 'విరోష్ ప్రీమియర్ లీగ్'ను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రష్మిక.. తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్‌పై ఫిబ్రవరి 26 అని రాసి ఉండడంతో పెళ్లి తేదీని ఇలా డిఫరెంట్‌గా ప్రకటించారని అభిమానులు సంబరపడుతున్నారు. వీరి పెళ్లికి ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు.
మరోవైపు ఉదయపుర్ విమానాశ్రయం అతిథులతో కళకళలాడుతోంది. తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, ఈషా, శ్రావ్యా వర్మ, ఆషిక రంగనాథ్, అనిల్ అంబానీలతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇన్నాళ్లు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన మోస్ట్ లవ్డ్ కపుల్ వివాహ వేడుకతో ఏడడుగులు వేసేందుకు సిద్దమవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. 26న జరిగే వివాహానికి కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని, రెండు కుటుంబాల నుంచి చెరో 100 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. మీడియా మిత్రుల కోసం ప్రత్యేక మీట్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ..
మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించిన విజయ్ Pelli Choopulu తో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, Arjun Reddy తో స్టార్‌డమ్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.
-
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ??












Click it and Unblock the Notifications