ఛీ.. ఛీ.. బిగ్‌ బాస్ హౌస్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణు ప్రియ

టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్‌ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్‌ చేయడంలో అమ్మడు దిట్ట.

ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు.అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మారిపోయింది. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Vishnu Priya was seen smoking a cigarette in the Bigg Boss house

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇక విష్ణు ప్రియ తాజాగా జరుగుతున్న బిగ్‌బాస్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. టాప్ కంటెస్టెంట్‌గా హోస్‌లో అడుగుపెట్టిన విష్ణు ప్రియ , మొదటి రెండు వారాలు గేమ్‌ బాగానే ఆడింది. ఆ తర్వాత తన పిచ్చి ఆటతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది.తన ఆటతో కన్నా ఎఫైర్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విష్ణు ప్రియ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విష్ణు ప్రియ మరో సమస్యలో చిక్కుకుంది.

బిగ్ బాస్ హౌస్‌లో విష్ణు ప్రియ సిగరెట్ తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అయితే తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని, విష్ణు ప్రియ ఎప్పుడు చెప్పలేదు. విష్ణు ప్రియ సిగరెట్ తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఛీ.. ఛీ.. విష్ణు ప్రియ సిగరెట్ తాగుతుందా అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా సెలబ్రిటీలు చాలామందికి డ్రికింగ్, స్మోకింగ్ అలవాటు ఉంటుందని, అది వారి వ్యక్తిగత విషయమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌లో యష్మీతో విష్ణు ప్రియ ఉంది. వీరిద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ మంచిగా ఆడకపోతే కచ్చితంగా విష్ణు ప్రియ ఎలిమినేట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+