'విష్ణు విన్యాసం' ఫస్ట్ రివ్యూ .. గంటన్నర పాటు నాన్ స్టాప్ ఫన్ రైడ్..!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ తో యువతలో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తన కామెడీ టైమింగ్, స్టోరీ సెలక్షన్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ నూ ఆకర్షిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస హిట్స్ తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్, సింగిల్ చిత్రాలతో అలరించాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన నారి నారి నడుమ మురారి సినిమాలో కామియో పాత్రలో మెప్పించాడు శ్రీవిష్ణు.
అయితే ఈ యంగ్ హీరో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీవిష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' మూవీ ఫిబ్రవరి 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ రన్ టైమ్ ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ రన్ టైమ్ కేవలం 1 గంటా 59 నిమిషాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం చాలా పెద్ద సినిమాలు రన్ టైమ్ 3 గంటలకు పైగా ఉంటోంది. ఈ నేపథ్యంలో 'విష్ణు విన్యాసం' మూవీకి తక్కువ రన్ టైమ్ ఉండటం గమనార్హం. అయితే అనవసర సీన్స్ కట్ చేసి కేవలం కథ మీదనే మూవీ టీమ్ దృష్టి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ ఫస్ట్ రివ్యూ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'విష్ణు విన్యాసం' మూవీ తాజాదా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం 'యూ ఏ' సర్టిఫికేట్ ను అందించింది. అంటే 16ఏళ్లపై వయసు ఉన్న వారు ఈ మూవీని చూసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ చిత్రంపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.

'విష్ణు విన్యాసం' మూవీ మొత్తం హిలేరియస్ ఫన్ రైడ్ అని టాక్ వినిపిస్తోంది. శ్రీవిష్ణు లెక్చరర్ పాత్రలో అదరగొట్టాడని టాక్ వస్తోంది. ఆయన కామెడీ టైమింగ్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఫస్టాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా ఉంటుందని.. టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ మాదిరి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్ కూడా అదే రేంజ్ లో కామెడీ సీన్స్ అదిరిపోయాయని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ మూవీ ఫుల్ రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే..
-
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!












Click it and Unblock the Notifications