'లైలా' ఫస్ట్ డే కలెక్షన్స్..ఇంత దారుణంగా ఉన్నాయ్ ఏంటీ బ్రో

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం 'లైలా'.రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఆసక్తికరమైన పాయింట్ బయటకు రావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ లతో మరింత హైప్ క్రియేట్ చేశారు.అయితే నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు, నటుడు పృథ్వీ సైతం వైసీపీకి క్షమాపణలు చెప్పడం జరిగింది.

రాజకీయ వివాదాల నడుమ విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.అయితే ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కథ లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కథ, కథనం రెండూ బాలేదని సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పాతతరం కథ , అర్థంలేని హస్యం, ఆకర్షణ లేని సినిమాగా 'లైలా' నిరాశపరిచిందని సినిమాపై ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

vishwak sen Laila movie first day collections

ఇదే సమయంలో 'లైలా' సినిమాకు కలెక్షన్లు సైతం పేలవంగానే ఉన్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా సినిమాకు అనుకున్నంతస్థాయిలో జరగలేదు.సినిమాకు ఒకరోజు ముందు అంటే గురువారం వరకు కేవలం 8 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదే విధంగా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్‌కి అటూ ఇటూగానే షేర్‌ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్‌గా డీసెంట్ మార్కెట్‌ను సొంతం చేసుకున్న తర్వాత విశ్వక్ సేన్‌కి ఇంత తక్కువలో ఓపెనింగ్స్ రావడం భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి.

దాస్ క ధమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. మెకానిక్ రాకీ సినిమా మాత్రం నిరాశ కలిగించింది.ఇప్పుడు 'లైలా' మూవీ , ఆ సినిమా కన్నా దారుణమైన ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో తెరకెక్కింది.ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిని రాబడితే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+