'వార్ 2' అట్టర్ ఫ్లాప్.. సూసైడ్ చేసుకోబోయిన స్టార్ హీరో..?
టాలీవుడ్ ,బాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ కలెక్షన్స్‌తో మొదటి వారాన్ని ముగించింది.'వార్ 2' సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు దాదాపు రూ. 22.75 కోట్ల షేర్ సాధించింది. అయితే, రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
రెండో రోజు రూ. 12.5 కోట్లకు పడిపోయిన వసూళ్లు, ఆ తర్వాత మరింత దిగజారాయి. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, లాభాల్లోకి రావాలంటే రూ. 307 కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాలి. అంటే, ఇంకా రూ. 137.71 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్షన్లు చూస్తుంటే, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్‌గా చేశారనే ప్రచారం వార్2కు నెగిటివ్‌గా మారాయి.

వార్2 ఫ్లాప్‌ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. క్రిటిక్ ఉమైర్ సంధు వార్ 2 ఫ్లాప్ గురించి ఓ ట్వీట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నిన్న రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇటీవల హృతిక్ రోషన్ నటించిన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలవడంతో వార్2 సినిమా భారీ అంచనాలు పెట్టుకున్నారని, ఈ సినిమా ఫ్లాప్ కావడంతో, తీవ్ర ఒత్తిడిలో ఉన్న హృతిక్ రోషన్ ఆత్మహత్య చేసుకోయారని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు.
BREAKING NEW : #HrithikRoshan tried to do suicide last night. He was in severe depression after back to back DISASTERS ! His career is totally OVER now. He locked himself in a room & did overdose of drugs !! He is fedup totally after #War2 FLOP. pic.twitter.com/oWM4Eo6tOM
— Umair Sandhu (@UmairSandu) August 28, 2025
అంతే కాకుండా హృతిక్ రోషన్ కెరీర్ ముగిసిపోయిందని, అతను డ్రగ్స్‌కు బానిసగా మారాడని , వార్ 2 ఫ్లాప్‌తో హృతిక్ పూర్తిగా విసుగు చెందిన అతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఉమైర్ సంధు తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తూ బ్రతికేస్తున్నావ్ అంటూ ఉమైర్ సంధుపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications