'ఆయ్' పెట్టిన చిచ్చు.. పరిశ్రమలో కులాల మధ్య ఆధిపత్య పోరు?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈనెల ఒకటోతేదీన తన 50 ఏళ్ల సినీ జీవితంపై వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి రావడంతోపాటు ఆయన మాట్లాడిన మాటలు హైలైట్ గా నిలిచాయి. తాను, బాలయ్య కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలని, మల్టీస్టారర్ సినిమా అని, దర్శకులెవరైనా కథను సిద్ధం చేయగలరా? అని అడిగారు. హీరోలంతా ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంటారు. కానీ వారి అభిమానులు మాత్రం బయట కురుక్షేత్ర సంగ్రామం చేస్తుంటారు.

నాలుగు దశాబ్దాలుగా గొడవలు
అందులోను ప్రధానంగా నాలుగు దశాబ్దాల నుంచి చిరంజీవి అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో తెలుగు ప్రజలంతా చూశారు. పరిశ్రమలో రెండు కులాల ఆధిపత్య పోరులో భాగంగా సినీ ప్రపంచానికి బయట వివాదాలు ఎక్కువవుతున్నాయంటూ ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తంచేసేవారు. హీరోలు మాత్రం కలిసినప్పుడల్లా ఎంతో స్నేహంగా ఉండేవారు. తాజాగా విడుదలైన ఆయ్ సినిమా చిరంజీవి అభిమానులకు, బాలయ్య అభిమానులకు మధ్య మరో చిచ్చు పెట్టింది.

war on social media between Balakrishna fans and Chiranjeevi fans over the movie Ai

పాత్రలను బట్టి కులం అనుకోవాలి
ఈ సినిమా మంచి విజయం సాధించింది. జూనియర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించారు. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోని కులాలు, ప్రేమలు అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమాను దర్శకుడు తీశారు. అయితే సినిమాలో ఎక్కడా ఎవరిది ఏ కులం అనేది చూపించలేదు. కేవలం మాటల్లోనే కులం అని వస్తుంటుంది. ఈ సినిమాలో విలన్ దుర్గ పాత్రలో నటించిన మైమ్ గోపి గొప్ప అని అందరూ అనుకుంటారు. అతను బాలయ్య అభిమాని కాబట్టి అతను కమ్మ కులానికి చెందిన వ్యక్తి అని ఆడియన్స్ అనుకుంటారు.

ఒకరిపై మరొకరి ట్రోలింగ్
ఈ సినిమా చివరలో కథానాయకుడి తండ్రికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ బయటకు వస్తుంది. అతను దుర్గను కొట్టిన బూరయ్యగా చూపిస్తారు. అంటే బాలయ్య ఆధిపత్యానికి చెక్ పెట్టిన చిరంజీవిలా ఆ షాట్ ఉందని ఆడియన్స్ అనుకుంటారు. దీనిపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. చిరంజీవి డామినేషన్ చూపించాడంటే కమ్మ కులం మీద కాపు కులం ఆధితప్యం ప్రదర్శించిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ విషయంలో చిరుపై బాలయ్య అభిమానులు, బాలయ్యపై చిరు అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రేమ కంటే స్నేహం గొప్పదని చూపించిన ఆయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+