2024లో ఏ హీరోయిన్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారో తెలుసా...?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇక హీరోయిన్లు అయితే ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు. హీరోయిన్లు తమ సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేందుకు ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఈ ఏడాది చాలామంది హీరోయిన్లు లైఫ్‌లైన్‌లోకి వచ్చారు. 2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అయితే 2024 సంవత్సరంలో నెటిజన్లు ఎక్కువగా ఓ హీరోయిన్ కోసం నెట్‌లో తెగ సెర్చ్ చేశారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి.ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్ తృప్తి డిమ్రి నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమాతో వచ్చేసింది.

యానిమల్‌లో మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక కన్నా సైడ్ హీరోయిన్‌గా చేసిన తృప్తి డిమ్రికే ఎక్కవ క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తృప్తి డిమ్రి గురించే చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి తృప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది.ఈ భామ గురించి నెటిజన్లు తెగ వెతికేశారు.












Click it and Unblock the Notifications