ఆ గ్రూప్ విజయ్ దేవరకొండను తొక్కేస్తోంది?
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే రేంజ్ లో ఇంకో సినిమా హిట్ కొట్టివుంటే స్టార్ హీరోగా మారిపోయివుండేవాడు. కానీ దురదృష్టం లైగర్ రూపంలో వెంటాడింది. సమంతతో నటించిన ఖుషీ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. గీతగోవిందం కాంబినేషన్ మరోసారి అంటూ విడుదల చేసిన ఫ్యామిలీస్టార్ మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ అనే టాక్ ను మూటకట్టుకుంది. దీంతో ఏ సినిమా చేస్తే అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తాను అనే సందిగ్ధంలో విజయ్ పడిపోయాడు.
ఒక గ్రూప్ దీనికోసమే పనిచేస్తోంది
విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గం గణేశా. ఇది 31వ తేదీన విడుదల కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆనంద్ సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీస్టార్ విడుదల కావడానికి 48 గంటల ముందునుంచే నెగెటివిటీని వ్యాప్తి చేశారని, యూట్యూబ్ లో సినిమా ఫ్లాప్ అంటూ వివిధ రకాల థంబ్ నైల్స్ పెట్టి ప్రచారం చేశారన్నారు. దీనికోసం ఒక గ్రూప్ పనిచేస్తోందని, ఆ గ్రూపే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని ఆనంద్ వెల్లడించారు. విజయ్ గత చిత్రాలను కూడా ప్రస్తావిస్తూ పూర్తి వ్యతిరేక ప్రచారం చేశారని చెప్పారు.

పరిమితికి మించి ప్రచారం చేశారు
ఫ్యామిలీ స్టార్ నెగెటెవిటీకి సంబంధించి దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన రెండురోజుల వరకు రివ్యూలు రాకుండా ఉంటే సినిమాలు నిలదొక్కుకుంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడే సినిమా బతుకుతుందన్నారు. ఫ్యామిలీస్టార్ పై పరిమితికి మించి నెగెటివిటీని వ్యాపింపచేశారన్నారు. దీనికి పరశురామ్ దర్శకత్వం వహించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్న ఆ గ్రూప్ ఎవరనేది తేలాల్సి ఉంది. సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల పేర్లను బయటకు తీసుకువస్తూ వారే, ఆ గ్రూపే అంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications