నానికి ఇష్టమైన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?

హీరో నాని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు. ఎటువంటి వారసత్వం, ఎవరి నుంచి మద్దతు లేకుండా సొంతంగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ తర్వాత నటనవైపు దృష్టిసారించి న్యాచురల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. మన పక్కింట్లో ఉండే కుర్రాడో, లేదంటే మన ఇంట్లోనే ఉండే కుర్రాడో ఉన్నట్లుగా ఉంటూ.. సహజంగా మాట్లాడుతూ.. అలా తన సహజమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే అది విడుదల కాబోతోంది. దీనితర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితర్వాత బలగం వేణు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. వీటితోపాటు మరికొందరు డైరెక్టర్లు చెప్పిన కథలను కూడా విన్నాడు. పరిశ్రమలోకి ఎవరి మద్దతు లేకుండా వచ్చిన నానికి తెలుగులో చిరంజీవి అంటే మహా ఇష్టం. ఎందుకంటే చిరంజీవి కూడా విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయనకు కూడా ఎవరి నుంచి మద్దతు లభించలేదు. తర్వాత తన కృషితో, పాటలు, ఫైట్లతో అభిమానులను సంపాదించుకొని మెగాస్టార్ గా ఎదిగారు.

who is hero nani favourite telugu star hero

చిరంజీవి తర్వాత రవితేజ అంటే కూడా నానికి మహా ఇష్టం. రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిశ్రమలో పనిచేస్తూ హీరోగా మారారు. తన కామెడీ టైమింగ్ తో అభిమానులు సంపాదించుకున్నారు. రవితేజ ఎనర్జీ అనేది అద్భుతంగా ఉంటుందని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని ఒక సందర్భంలో నాని చెప్పారు. ఇలా కష్టపడి ఎవరి నుంచి మద్దతు లేకుండా స్వయంశక్తితో ఓ స్థాయికి ఎదిగిన చిరంజీవి, రవితేజ, నాని.. ఇలా ఈ ముగ్గురు అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా అమితమైన ఆరాధనా భావం ఉంటుంది. పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఈ ముగ్గురు ప్రస్తుతం దూసుకుపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+