2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న తెలుగు హీరో
తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ పరిశ్రమను దాటేసింది. అక్కడి ప్రేక్షకులు కూడా తెలుగు నుంచి వచ్చే సినిమాలను, తెలుగు హీరోలను విపరీతంగా ఆదరిస్తున్నారు. తెలుగులో యువ హీరోలు ఎక్కువగా ఉండటం, బాలీవుడ్ లో యువ స్టార్ హీరోలు వేళ్లమీద లెక్కపెట్టకలిగేంత సంఖ్యలోనే ఉండటం కూడా ఒక కారణం. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి హీరోలు ఏ సినిమాలు చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటామనే విషయంలో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మన తెలుగు సినిమా రేంజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
మూడేళ్లుగా షూటింగ్ లోనే..
ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రవితేజ, నాని లాంటి యువ స్టార్ హీరోలతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి కల్కి సినిమా రాగా, జూనియర్ ఎన్టీఆర్ నుంచి దేవర, మహేష్ బాబు నుంచి గుంటూరుకారం, నాని నుంచి సరిపోదా శనివారం, విజయ్ దేవరకొండ నుంచి ఫ్యామిలీస్టార్ సినిమాలు వచ్చాయి. మూడు సంవత్సరాలకు పైగా పుష్ప2 షూటింగ్ లోనే అల్లు అర్జున్, గేమ్ ఛేంజర్ షూటింగ్ లోనే రామ్ చరణ్ ఉన్నారు.

సినిమాకు రూ.200 కోట్లు
సినిమాకు మనవారు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ 100 కోట్లరూపాయల నుంచి రూ.125 కోట్లు తీసుకుంటారంటారు. సలార్ సినిమాకు ప్రభాస్ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకున్నారు. కల్కి సినిమాకు కూడా అదేస్థాయిలో పారితోషికాన్ని తీసుకున్నారు. సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారంటున్నారు. దీన్ని బట్టి ఈ ఏడాది అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా ప్రభాస్ నిలిచారు. భవిష్యత్తులో ఈ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications